పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-04T06:06:56+05:30 IST

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గిచాలని డిమాండ్‌ చేస్తూ మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలి
జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు


 టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

తనకల్లు, జూలై 3: పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గిచాలని డిమాండ్‌ చేస్తూ మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గిచాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ... వైసీపీ అధికారం చెపట్టినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా నిత్యవసర వస్తువులు, ఆర్టీసీ, విద్యుత చార్జీలు పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతోందని విమర్శించారు. దీంతో సామాన్యల జీవనం దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలన  బాదుడే బాదుడు అన్నట్లు సాగుతోందే తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఇటువంటి ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ పెంచిన చార్జీలను తగ్గించేవారకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చ రించారు. జాతీయ రహదారిపై ఓ గంటపాటు రాస్తారోకో నిర్వహించ డంతో రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.  అనంతరం వారు ఆందోళన విరమించడంతో రాకపోకలకు అంతరాయం తొలగింది. ఈకార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, నాయకులు మాధవరెడ్డి, మహబూబ్‌బాషా, మైనార్టీ దస్తగిరి, ఎస్సీ చిన్నప్ప, ఎస్టీ శంకర్‌నాయక్‌, ఉత్తన్ననాయక్‌, రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ రమణయ్య, నాగేంద్ర ప్రసాద్‌రాయల్‌, రవి, షపీవుల్లా, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.


Updated Date - 2022-07-04T06:06:56+05:30 IST