దసరాను పురస్కరించుకొని ఆర్టీసీకి పెరిగిన ఆదాయం

ABN , First Publish Date - 2021-10-20T04:48:50+05:30 IST

దసరా పర్వదినం సందర్భంగా ఆర్టీసీకి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తొమ్మిది డిపోలలో కోటీ 40లక్షల 13 వేల 521 రూపాయల ఆదాయం వచ్చింది.

దసరాను పురస్కరించుకొని ఆర్టీసీకి పెరిగిన ఆదాయం

 - తొమ్మిది డిపోల నుంచి రూ. 1.40కోట్ల పైనే..

- మహబూబ్‌నగర్‌ నుంచి అత్యధికం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 19 : దసరా పర్వదినం సందర్భంగా ఆర్టీసీకి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తొమ్మిది డిపోలలో కోటీ 40లక్షల 13 వేల 521 రూపాయల ఆదాయం వచ్చింది. అత్య ధికంగా మహబూబ్‌నగర్‌ డిపో ఆదాయం రూ. 21,52,350లు వచ్చింది. గద్వాల డిపో ఆదాయం 17లక్షల 37వేల185, నారాయణపేట డిపో ఆదా యం 15,91,351, షాద్‌నగర్‌ డిపో ఆదాయం 15,65,623, వనపర్తి డిపో ఆదాయం 20,25,240, అచ్చంపేట డిపో ఆదాయం 13,05,715, కల్వకుర్తి డిపో ఆదాయం 14,77,382, కొల్లాపూర్‌ డిపో ఆదా యం 10,05,893, నాగర్‌కర్నూ ల్‌ డిపో ఆదాయం 11,52,782 వచ్చినట్లు అధికారులు తెలి పారు. మహబూబ్‌నగర్‌ డిపో ఆదాయం గతంలో కంటే అ త్యధికంగా వచ్చిందని డీఎం అశోక్‌రాజు తెలిపారు. పండు గ ముందు రోజు రూ. 17ల క్షల వరకు డిపో ఆదాయం వ చ్చిందని, మంగళవారం సు మారు రూ.18 లక్షల ఆదా యం వరకు వచ్చిందని డీఎం తెలిపారు. పర్వదినం సంద ర్భంగా ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించినందుకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఆర్టీసిని ప్రజలు ఆదరించాలని కోరారు.

Updated Date - 2021-10-20T04:48:50+05:30 IST