Abn logo
Sep 24 2021 @ 00:46AM

సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం

సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివరావు

- ఏఐటీయూసీ జనరల్‌ సెక్రెటరీ సాంబశివరావు

రామగిరి, సెప్టెంబర్‌ 23: సింగరేణిలో రాజకీయా జోక్యం మితిమిరిపో యిందని ఏఐటీయూసీ జనరల్‌ సెక్రెటరీ, వేజ్‌బోర్డు సభ్యుడు సాంబశివ రావు విమర్శించారు. గురువారం ఆర్జీ-3 డివిజన్‌లోని సెంటినరీకాలనీలో ని ఖేల్‌మహేంద్ర భవన్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ ఆఫీస్‌ బేరర్స్‌ సమా వేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వంలోని పాలకులు సింగరేణిలో జోక్యంతో ఆర్థిక దోపిడీకి కారణం అవుతోందన్నా రు. కార్మికుల శ్రమ గుర్తించలేని నాయకులు ఇష్టానుసారంగా సింగరేణి లో వ్యవహరిస్తున్నారన్నారు. సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘం నేత లు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. కేవలం యా జమాన్యాలకు కొమ్ముకాస్తూ వారు కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నరని దుయ్యాబట్టారు. సింగరేణిలో కార్మికులకు పని భారం పెరిగినా, ప్లేడేలు కల్పించకున్నా టీబీజీకేఎస్‌ నేతల్లో చలనం కనిపించడం లేదని విమర్శించారు. మరికొన్ని నెలల్లో నే గుర్తింపు సంఘం యాజమాన్యానికి మోకరిల్లే అవకాశం లేకపొలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం భూములను కొల్లగొడుతుండగా, కేంద్రం ప్రభుత్వం అంబాని, ఆదానీలకు బానిసలుగా మారారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు రాక్షస పాలన సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. వీరి పాలనలో ఏ వర్గాలకు మేలు జరిగే అవకాశాలు లేవని ఆరో పించారు. ఈ సమావేశంలో అడిషన్‌ జనరల్‌ సెక్రెటరీ సీతా రామయ్య, డిప్యూటిజనరల్‌సెక్రెటరీ వై.వీరావు, ఆర్జీ-3 బ్రాంచీ సెక్రటరీ జూపాక రాంచందర్‌, పెద్ద సంఖ్యలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.