Abn logo
Sep 27 2021 @ 00:23AM

కల్యాణపులోవకు పెరిగిన ఇన్‌ఫ్లో

కల్యాణపులోవ నాలుగు గేట్లు ఎత్తి సర్పా నదిలోకి నీటిని విడిచి పెడుతున్న దృశ్యం

నాలుగు గేట్లు ఎత్తి  నీరు విడుదల

రావికమతం, సెప్టెంబరు26:  తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో కల్యాణపు లోవ జలాశయానికి వరద ప్రవాహం పోటేత్తుతోంది. గత మూడు రోజులుగా రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండంతో కొండగెడ్డల ద్వారా వరద నీరు వచ్చి  చేరుతోంది.  460 అడుగుల నీటి నిల్వ సామర్థ్యంగల ఈ రిజర్వాయరులో శనివారం నాటికి 457.6 అడుగుల మేర నీటి నిల్వ ఉండగా రెండు గేట్లు ఎత్తి 120 క్యూసెక్కుల నీటిని సర్పా నదిలోకి విడిచి పెట్టారు. అయితే వర్షాల ప్రభావంతో 350 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్తో వస్తుండంతో ఆదివారం మధ్యాహ్నం నాటికి రిజర్వాయర్‌లో 458.6 అడుగుల మేర నీరు నీల్వ ఉంది. ప్రమాద స్ధాయికి నీటిమట్టం చేరడంతో నాలుగు గేట్ల్లు ఎత్తి సుమారు 250 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నట్టు ఏఈ సత్యనారాయణదొర తెలిపారు.