పెరిగిన భూగర్భ జల మట్టం

ABN , First Publish Date - 2022-01-25T04:56:58+05:30 IST

రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో భూగర్భజలాల మట్టం పెరిగిందని, తద్వారా ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

పెరిగిన భూగర్భ జల మట్టం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

- తాళ్లచెరువు, లక్ష్మీకుంట చెరువు పనుల పరిశీలన 


వనపర్తి అర్బన్‌, జనవరి 24 : రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో భూగర్భజలాల మట్టం పెరిగిందని, తద్వారా ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలం తాళ్లచెరువు, లక్ష్మీకుంట చెరువు పనులను కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత పెంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  


అభివృద్ధి పథకాల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలి

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాల పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం వనపర్తి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు పథకానికి నియోజకవర్గం నుంచి వంద మంది లబ్ధిదారులను గుర్తించి, మార్చిలోగా ఎంపిక చేసి వెంటనే అమలు చేసేలా కార్యాచరణ రూపొందిం చాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రెండు పడక గదుల ఇండ్లు, పల్లె ప్రకృతివనాలు, సీసీ, బీటీ రోడ్లు, రెవెన్యూ, మునిసిపాలిటీ, అటవీశాఖ స్థలాల సరిహద్దులు, వ్యాక్సినేషన్‌, రైతుల సమస్యలు, ఎల్పీజీ గ్యాస్‌ పైపులైన్‌ పనులు, కేజీబీవీ రేవల్లి స్థల పరిశీలన, ఎలక్ర్టిసిటీ, బాలరక్షా భవన్‌ స్థల పరిశీలన, పీఏసీఎస్‌ గోదాము స్థల పరిశీలన, ఇరిగేషన్‌ తది తర అంశాలపై మంత్రితో చర్చించారు. సమా వేశంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.   


అంజన్నగుడి నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుకు కృషి 

గోపాల్‌పేట : మండలంలోని పొలికపాడ్‌ ఆముదాలకుంట తండాలో అంజన్న గుడి నూతన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరుకు కృషి చేయిస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమ వారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో తండావాసులు మంత్రిని కలిశారు. తమ తండా లో ఏ గుడీ లేదని, అంజన్న గుడి నిర్మాణానికి సహ కరించాలని వారు కోరగా, స్పందించిన మంత్రి గుడి నిర్మాణానికి రూ.25 వేలు విరాళం అందించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో తండావాసులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో నాయకుడు శివకుమార్‌ తది తరులున్నారు.



Updated Date - 2022-01-25T04:56:58+05:30 IST