పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-08T04:15:51+05:30 IST

పెంచిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. గురువారం ఐబీ చౌరస్తాలో పెంచిన గ్యాస్‌ ధరలకు నిరసనగా టీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ధర్నా నిర్వహించారు. సిలిండర్‌లతో నిరసన చేపట్టి రోడ్డుపై వంట చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పెంచిన గ్యాస్‌ ధరలను తగ్గించాలి
రోడ్డుపై బైఠాయించి ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న బాల్క సుమన్‌, దివాకర్‌రావు

ఏసీసీ, జూలై 7: పెంచిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. గురువారం ఐబీ చౌరస్తాలో పెంచిన గ్యాస్‌ ధరలకు నిరసనగా టీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ధర్నా నిర్వహించారు. సిలిండర్‌లతో నిరసన చేపట్టి రోడ్డుపై వంట చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ నిత్యావసర ధర లను రోజురోజుకు పెంచుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధాని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని, మోదీ గద్దెదించే రోజులు  దగ్గరపడ్డాయన్నారు. 2014లో 650 ఉన్న సిలిండర్‌ ధర ప్రస్తుతం రెట్టింపు అయిందన్నారు. ప్రధాని మోదీ ఎల్‌ఐసీ, సింగరేణి, బీఎస్‌ఎన్‌ఎల్‌, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబె డుతున్నారని ఆక్రోశం వెల్లగక్కారు. మోదీ దేశానికి కాకుండా అదానీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వారిని నట్టేట ముం చారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు విడుదల చేయడం లేదని, విభజన హామీలో పేర్కొన్న  గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయడం లేదని,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మండలాలను  ఆంధ్రాలో విలీనం చేసి తెలంగాణకు ద్రోహిగా  మోదీ నిరూపించుకున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీడీపీ పెంచమంటే గ్యాస్‌, డీజిల్‌,  పెట్రోల్‌ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రజలపై భారం పడకుం డా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంద న్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డా యన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పల్లె భూమేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌  సందెల వెంకటేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు ముఖేష్‌గౌడ్‌, తోట శ్రీనివాస్‌, యువ నాయకులు నడిపెల్లి విజిత్‌ రావు, పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి,  కార్మిక సం ఘం నాయకులు సురేందర్‌రెడ్డి, ఏనుగు రవిందర్‌రెడ్డి,  వెంగల కుమారస్వామి, సోహెల్‌ఖాన్‌, సుదమల్ల హరికృష్ణ, బింగి ప్రవీణ్‌, రాకేష్‌ పాల్గొన్నారు.  

మందమర్రిటౌన్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాల నాయకులు  ప్రభుత్వ విప్‌ కార్యాలయం వద్ద గ్యాస్‌ సిలిండర్‌లతో  నిరసన తెలిపారు. నాయకులు నిరోష, గోపికలు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్‌ ధరలను విచ్చలవిడిగా పెంచుతుందని, దీంతో నిరుపే దలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలను తగ్గించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలి పారు. నాయకులు జె. రవీందర్‌, సంపత్‌, రాజు, వెంకటేష్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కాంటా చౌరస్తా వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు వంటగ్యాస్‌ సిలిండర్‌లతో ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం రోజురోజుకు గ్యాస్‌, నిత్యావసర సరుకులు, పెట్రో లు ధరలను పెంచుతూ సామాన్య ప్రజలు జీవించ లేని పరిస్థితులను కల్పిస్తుందని తెలిపారు.


Updated Date - 2022-07-08T04:15:51+05:30 IST