Abn logo
Sep 25 2021 @ 23:21PM

నేర పరిశోధనలో పెరిగిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాధాన్యం

వర్చువల్‌ వర్క్‌షాప్‌లో పాల్గొన్న మిరాజ్‌ ఉద్దీన్‌ తదితరులు

సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ కశ్మీర్‌ వీసీ ప్రొఫెసర్‌ మిరాజ్‌ ఉద్దీన్‌

సబ్బవరం, సెప్టెంబరు 25 : నేర పరిశోధనలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాధాన్యం ఇటీవల కాలంలో బాగా పెరిగిందని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కశ్మీర్‌ వీసీ ప్రొఫెసర్‌ మిరాజ్‌ ఉద్దీన్‌ తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ‘ఫోరెన్సిక్‌ సైన్స్‌, సాక్ష్యాల ప్రాధాన్యత’ అనే అంశంపై వర్చువల్‌ విధానంలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర పరిశోధకులు, పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకుని నేర పరిశోధన చేయాలని, అప్పుడే సరైన సాక్ష్యాలు సంపాదించగలరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో క్లిష్టమైన కేసులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ద్వారా పరిష్కరించారని, నేర పరిశోధనలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రాధాన్యం పెరిగిందన్నారు. లా విద్యార్థులు ఫోరెన్సిక్‌ సైన్స్‌లో కూడా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అయన చర్చించారు. అంతకు ముందు వీసీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ ఎన్నో కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లభించని పరిస్థితుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌లోని అనేక వెళుకువలను అనుసరించి కేసులను ఛేదించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్‌ సైన్స్‌లో నైపుణ్యతను పెంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కే మధుసూదనరావు, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దయానందమూర్తి, ప్రొగ్రామ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ నందిని, విద్యార్థులు పాల్గొన్నారు.