చింతపల్లిలో కురుస్తున్న మంచు
చింతపల్లి, నవంబరు 30: మన్యంలో చలి తీవ్రత పెరుగుతున్నది. మంగళవారం చింతపల్లిలో 14.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా ఏజెన్సీలో అక్టోబరు ఆఖరి నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. ఈఏడాది అల్పపీడనాల కారణంగా కురిసిన వర్షాలతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పు రావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. లంబసింగి, చెరువులవేనం, చింతపల్లి ప్రాంతాల్లో ఉదయం మంచు దట్టంగా కురుస్తున్నది.