కొబ్బరి తింటే బరువు పెరుగుతారా?

ABN , First Publish Date - 2021-05-14T20:46:35+05:30 IST

వందగ్రాముల కొబ్బరిలో 350 వరకు కెలోరీలు ఉంటాయి. వీటిలో అధికభాగం అందులో ఉండే 30 గ్రాముల కొవ్వుపదార్థాల నుండే వస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు చాలా తక్కువ. కొబ్బరిలో ఉండే కొవ్వుపదార్థాల్లో దాదాపు తొంభైశాతం సాచ్యురేటెడ్‌ కొవ్వులే.

కొబ్బరి తింటే బరువు పెరుగుతారా?

ఆంధ్రజ్యోతి(14-05-2021)

ప్రశ్న: కొబ్బరి పోషక విలువలు తెలియచేయండి. కొబ్బరి రక్తంలో చెడు కొలెస్ర్టాల్‌ని తగ్గిస్తుందా?


- కీర్తి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వందగ్రాముల కొబ్బరిలో 350 వరకు కెలోరీలు ఉంటాయి. వీటిలో అధికభాగం అందులో ఉండే 30 గ్రాముల కొవ్వుపదార్థాల నుండే వస్తాయి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు చాలా తక్కువ. కొబ్బరిలో ఉండే కొవ్వుపదార్థాల్లో దాదాపు తొంభైశాతం సాచ్యురేటెడ్‌  కొవ్వులే. సాధారణంగా సాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి హానికరం. కానీ కొబ్బరిలో ఉండే సాచ్యురేటెడ్‌ కొవ్వులో మీడియం చెయిన్‌ ట్రైగ్లిసరైడ్స్‌ (ఎంసీటీ) ఎక్కువగా ఉండడం వల్ల ఇందులో ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని  పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఈ ఎంసీటీ లు నేరుగా రక్తంలోకి శోషించు కోవడం వల్ల శక్తినిచ్చేవిగా ప్రసిద్ధిచెందాయి. ఆకలిని నియంత్రించేందుకు, శరీరంలోని అధిక కొవ్వును కరిగించేందుకు కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా పరిమిత మోతాదుల్లో కొబ్బరి తినవచ్చు. రోజూ కొద్దిగా కొబ్బరి తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ర్టాల్‌ కొంత తగ్గడమేకాక మంచి కొలెస్ర్టాల్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. అయితే మితి మీరి తినడం వల్ల బరువు పెరిగే అవకాశం, తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-05-14T20:46:35+05:30 IST