మున్సిపల్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

ABN , First Publish Date - 2022-01-28T05:25:10+05:30 IST

రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, యాసిన్‌ కోరా రు.

మున్సిపల్‌ కార్మికుల వేతనాలు పెంచాలి
నగర పంచాయతీ కమిషనర్‌కు, చైర్మన్‌కు సమ్మెనోటీసు అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

సమ్మె నోటీసు ఇచ్చిన  ఏఐటీయూసీ నాయకులు

కనిగిరి, జనవరి 27: రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచా లని ఏఐటీయూసీ జిల్లా నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, యాసిన్‌ కోరా రు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ అ నుబంద సంస్థ అయిన ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశితోష్‌ మిశ్రా పీఆర్సీ కమిటీ ప్రకారం ఉద్యోగ సంఘాలకు గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ వస్తుందని మున్సిపల్‌ కార్మి కులు ఎదురు చూడగా నిరాశ మిగిలిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు కార్మిక సంఘాలు ఉద్యమబాట పట్టారన్నారు. ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని, లేకుండా సమ్మెబాట పడతామని హెచ్చరించారు. ఈ మేరకు నగర పంచాయతీ ఎఫ్‌ఏసీ కమిషనర్‌ లావణ్య, మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌కు సమ్మెనోటీసు అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు షేక్‌ నాసర్‌, రత్తయ్య, మస్తాన్‌, శేషయ్య, అశోక్‌, కోటి, సుబ్రమణ్యం, కాశీంపీరా, చంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:25:10+05:30 IST