కూలీల సంఖ్య పెంచండి

ABN , First Publish Date - 2022-05-29T04:31:45+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ శివప్రసాద్‌ అన్నారు.

కూలీల సంఖ్య  పెంచండి
చిట్లూరులో పశువుల తాగునీటి కుంటను పరిశీలిస్తున్న డ్వామా పీడీ శివప్రసాద్‌

డ్వామా పీడీ శివప్రసాద్‌


రామాపురం, మే 28: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ శివప్రసాద్‌ అన్నారు. మండలంలోని చిట్లూరు పంచాయతీలోని మాలపల్లె సమీపంలో ఉన్న చెరువులో ఏర్పాటు చేసిన పశువుల తాగునీటి వనరుల కుంటను శనివారం ఆయన పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. సగటు రోజు వేతనం రూ.257 వచ్చే విధంగా పనిచేయాలని కూలీలతో తెలిపారు. పనులు అవసరమున్న వారు సంబంధిత ఫీల్డ్‌ సిబ్బందికి లేదా ఏపీవోకు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పనులు కల్పిస్తామన్నారు. హౌసింగ్‌ లబ్ధిదారులకు వచ్చే 90 పనిదినాలు వేతనం వారం వారం నిరంతరంగా చెల్లించాలని, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అర్హత కలిగిన కుటుంబాల వారికి పండ్ల తోటల పెంపకానికి అవసరమైన ధ్రువపత్రములు తీసుకుని ఎస్టిమేట్లు వేసి కలెక్టర్‌ పరిపాలనా అనుమతి తీసుకుని వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ వెంకట్రమణారెడ్డి, ఏపీవో సురేంద్రనాధరెడ్డి, ఈసీ శ్రీకాంత్‌రెడ్డి, క్లస్టర్‌ టీఏ ఆంజనేయులు, టీఏ రవీంద్ర, ఎఫ్‌ఏ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T04:31:45+05:30 IST