‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి

ABN , First Publish Date - 2022-01-20T04:01:17+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో కనీసం 50 మంది కూలీలు ఉండేలా చూడాలని డీఆర్‌ డీవో శేషాద్రి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కూలీల కు ఇచ్చే వేతనాలను వారంవారం చెల్లించాలన్నారు.

‘ఉపాధిహామీ’లో కూలీల సంఖ్యను పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో శేషాద్రి

 హాజీపూర్‌, జనవరి 19: ఉపాధిహామీ పనుల్లో   కనీసం 50 మంది కూలీలు ఉండేలా చూడాలని డీఆర్‌ డీవో శేషాద్రి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కూలీల కు ఇచ్చే వేతనాలను వారంవారం చెల్లించాలన్నారు.  వచ్చే హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు.  వరికళ్లాలను త్వరగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను పరిశీలిస్తూ మొక్కలు పెరిగేలా చూడాల న్నారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున జాగ్రత్తలు పాటిస్తూ పనులను చేయించాలన్నారు. అడిషనల్‌ డీఆర్‌డీవో దత్తరావు, ఎంపీడీవో ఎంఏహై, ఏపీవో మ ల్లయ్య, ఈసీశ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులు  పాల్గొన్నారు. 

జైపూర్‌ : ఉపాధిహామీ పథకంలో రోజు వారీ కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్‌డీవో శేషాద్రి పేర్కొ న్నారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామపం చాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం కొత్త సాప్ట్‌వేర్‌  తీసుకువ స్తుందని, ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నా రు. గ్రామాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని సూచించారు.  ఎంపీడీవో కే.నాగేశ్వర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి సతీ ష్‌కుమార్‌, ఉపాధిహామీ అధికారి బాలయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:01:17+05:30 IST