టెస్టింగ్‌ ట్రబుల్‌

ABN , First Publish Date - 2022-01-21T05:15:14+05:30 IST

కొవిడ్‌ చాపకింద నీరులా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పుంజుకుం టున్నది.

టెస్టింగ్‌ ట్రబుల్‌
నిడదవోలులో తాళం వేసిన కెనరా బ్యాంకు

 చాప కింద నీరులా కేసులు.. మూడు రోజులుగా 200 పైమాటే..

 దగ్గు, జ్వరం, జలుబుతో జనం అవస్థలు..  ప్రభుత్వాసుపత్రులకు క్యూ

 కొందరికే కొవిడ్‌ పరీక్షలు.. తగ్గిన టెస్టులపై ఆందోళన

 ఎందుకు చేయడం లేదు.. భయమా.. దాపరికమా ? : ప్రజల్లో  సందేహాలు

 ప్రైవేటును ఆశ్రయిస్తున్న బాధితులు


కొవిడ్‌ చాపకింద నీరులా విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పుంజుకుం టున్నది. అధికారిక టెస్టుల్లో ఫలితాలు మూడంకెలు దాటకున్నా.. అనధికారికంగా  ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఉండవచ్చు. కొవిడ్‌ కట్టడికి ముందస్తు చర్యలు చేపడుతున్నా టెస్టుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. సమీక్షిం చాల్సిన యంత్రాంగం దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒమైక్రాన్‌ కేసులు  ఈ జిల్లాలో పెద్దగా నమోదు కాకపోయినా కొవిడ్‌ వైరస్‌  మాత్రం మెల్లగా విస్తరిస్తూనే ఉంది. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

కరోనా కట్టడికి తాము సిద్ధమేనంటూ ప్రకటించిన యంత్రాంగం టెస్టుల సంఖ్యను పెంచడం లేదు. జిల్లాలో కరోనా వైరస్‌ చాప కింద నీరులా మెల్లగా చొచ్చుకొస్తూనే ఉంది. విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్లి వస్తున్న అనేక మందిలో క్రమంగా వైరస్‌ లక్షణాలు బయటపడుతు న్నాయి. తీవ్ర జ్వరంతోపాటు గొంతు నొప్పులతో బాధపడుతున్న అనేక మంది టెస్టుల కోసం టెస్టింగ్‌ కేంద్రాలకు వెళుతున్నారు. కొన్ని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం అరకొరగానే కొందరి నుంచి టెస్టు రిపోర్టులు తీసుకుంటుండగా మరికొందరిని గాలికొది లేస్తున్నారు. అసలు ఇదంతా దాపరికమా, లేకుంటే ప్రజల్లో మరింత భయాందోళనలు పెరగకుండా భయ మా అనేది ఇప్పుడు అందరినోట వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. రెండు విడతల కరోనా విజృంభణ సమయంలో రోజుకు వేలాది మందికి టెస్టులు నిర్వహించే వారు. ఇప్పుడా పరిస్థితి మారింది. యలమంచిలి, ఆకివీడు, తదితర మండలాల్లో ఈ తరహా పరిస్థితి నెలకొంది. మిగతా పట్టణ  ప్రాంతా ల్లోనూ ఆర్టీపీసీఆర్‌ టెస్టుల కు వచ్చే వారి సంఖ్య  భారీగానే ఉన్నా ఆ వివరా లేవీ వెల్లడి కాకుండా కాస్తంత గుట్టుగానే వ్యవ హరిస్తున్నారు. రెండు విడతల కరోనా వేవ్‌ సమయంలో ప్రభుత్వ ల్యాబ్‌ల్లోనే టెస్టులకు అంతా సిద్ధపడేవారు. కాస్త ధనిక వర్గం మాత్రం ప్రైవేటు ల్యాబ్‌లవైపు మొగ్గు చూపేది. ఇప్పుడు  కొందరు ‘సెల్ఫ్‌ కిట్‌’ల సాయంతో నిర్ధారణకు ప్ర యత్నిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య భారీగానే కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాలన్నింటి లోనూ సొంత కిట్‌లతో పాటు తమకు తెలి సిన ల్యాబ్‌లు, స్కానింగ్‌ కేం ద్రాల ద్వారా నిర్ధారణకు దిగుతున్నారు. ఒకవేళ పాజిటివ్‌ బయట పడితే ఎవరంతట వారుగా హోం ఐసోలేషన్‌కు వెళ్తు న్నారు. ల్యాబ్‌ ఫలితాలు వచ్చే వరకు ఆగలేని ఇంకొం దరు జనంతో మిళితమవుతు న్నారు. తద్వారా వైరస్‌ వ్యాప్తి మరింత దాడి చేయ బోతోంది. రైతుబజార్లు, మాల్స్‌, బంగారు దుకాణాలు, చేపల మార్కెట్‌లు, ప్రధాన వీధుల్లోను మాస్క్‌లు లేకుండా ఇప్పటికీ కొందరు స్వేచ్చగా సంచరిస్తున్నారు. జిల్లాలో రోజుకు 200లకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. గురువారం  ఒక్కరోజే 216 నమోదయ్యాయి. భీమ వరం ప్రాంతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈ మధ్యన మరింత విస్తరిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తదుపరి స్థానం ఏలూరు నుంచి నరసాపురం వరకు దాదాపు అన్ని పట్టణాల్లోను కొవిడ్‌ పాజిటివ్‌ క్రమేపీ పుంజు కుంటుంది. ఈ మధ్యన మరింత పెరిగి ఏజెన్సీ ప్రాంతాన్ని కమ్మేస్తోంది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య మాత్రం ఇప్పటికీ అంతంతే.


అంతా సిద్ధమేనా ?

కొవిడ్‌కు టిడ్కో ఇళ్ల దగ్గర నుంచి కల్యాణ మండ పాల వరకు అంతా సిద్ధం చేయండంటూ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. గతంలో కొవిడ్‌ బాధితులకు ఆహారం, వ్యక్తి గత కిట్‌లు అంటే బకెట్టు, మగ్గు, ఇతరత్రా పరికరాలు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో బిల్లులు రాలే దనే విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో మరోమారు టిడ్కో ఇళ్లను కొవిడ్‌ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభు త్వం సిద్ధపడుతుంటే, ఆ మేరకు సౌకర్యాలు సమకూ ర్చేందుకు ఇంతకుముందు ఉన్న కాంట్రా క్టర్లు ముందు కు వస్తారా అనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు ఇప్పటికే దగ్గు, జలుబు, జ్వరం మందుల అమ్మకాలు అన్ని మెడికల్‌ షాపుల్లోను భారీగా పెరిగా యి. పది రోజులుగా ఈ లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. దగ్గు మందు, జలుబు నివారణ మందు ల కోసం అత్య ధికులు మందుల షాపు ల వైపు పరుగులు తీస్తున్నారు. కొందరైతే ఆక్సిజన్‌ సిలిండర్లను ముందస్తు రిజర్వు చేసుకుంటు న్నారు. ఇంకొందరు కరోనా నివారణ కిట్‌లను సిద్ధం చేసుకుంటున్నారు.


22 మంది టీచర్లకు పాజిటివ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 20 : జిల్లాలో టీచర్లపై కొవిడ్‌ ప్రతాపం కొనసాగుతుంది. గురువారం వెల్లడైన ల్యాబ్‌ పరీక్షల ఫలితాల్లో మొత్తం 22 మంది ఉపాధ్యా యులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నాలుగు రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో బాధితు లందరూ టీచర్లే కావడం గమనార్హం. తాజాగా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారితో కలిపి మొత్తం 43 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ సోకింది. వీరందరూ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారే. గురువారం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన టీచర్లలో చిడిపి, ఏపూరు, పాత ముప్పర్రు, కాళ్ళకూరు, కోపల్లె, కోండ్రు ప్రోలు, దోసపాడు, పోతునూరు, ఉండ్రాజవరం, విస్సా కోడేరు, మైసన్నగూడెం, చిన్నావారిగూడెం, దేవుపల్లి మెయిన్‌, నరసాపురం పంజాసెంటర్‌, పీచుపాలెం, కొప్పరు ఈస్ట్‌, విజయరాయి, సీఆర్‌ పురంలలోని పాఠశాలలకు చెందిన వారు ఉన్నారు.


250 పడకలతో ఐదు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ఏలూరుసిటీ, జనవరి 20: జిల్లాలో 250 పడకలతో ఐదు కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ప్రారంభించినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) బీఆర్‌ అంబేడ్కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. చింతలపూడి కల్యాణ మండపంలో 60 పడకలు, కొవ్వూరు టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలు, తణుకు టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలు, ఆచంట రామేశ్వరస్వామి సత్రం కల్యాణ మండ పంలో 40 పడకలు, నర్సాపురం ఇంటర్నేషనల్‌ లేసు ట్రేడ్‌ సెంటర్లో 50 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధం చేశామన్నారు. వీటి పర్యవేక్షణకు నాన్‌– మెడికల్‌ నోడల్‌ అధికారులను నియమించామన్నారు. చింతలపూడి సీసీసీకి ఆర్‌అండ్‌బీ ఏఈఈ సుందరరావు (94408 18712), కొవ్వూరుకు ఆర్‌అండ్‌బీ టెక్నికల్‌ అధికారి ఎస్‌కె మస్తాన్‌ (89193 92913), తణుకు డ్రైనేజీ సబ్‌ డివిజన్‌ డీఈఈ రాంబాబు (81068 14848), ఆచంటకు ఆర్‌అండ్‌బీ ఏఈఈ ప్రసాద్‌ (94408 18728), నర్సాపురానికి ఆర్‌అండ్‌బీ ఏఏఈ నిత్యక్రుజ్‌ (94408 18723)లను నియమించామన్నారు. ప్రతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు ముగ్గురు అసిస్టెంట్‌ నోడల్‌ అధికారులను, 9 మంది హెల్ప్‌డెస్క్‌ మేనేజర్లను, 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను మూడు షిప్టులుగా నియమించినట్టు అంబేడ్కర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-21T05:15:14+05:30 IST