కమీషన్ల కోసమే విదుత చార్జీల పెంపు : టీడీపీ

ABN , First Publish Date - 2021-10-19T04:48:21+05:30 IST

కమీషన్ల కోసమే వైసీపీ ప్రభుత్వం అధిక రేట్లతో విద్యుత కొనుగోలుచేసి ఆభారాన్ని పేదలపై మోపిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు.

కమీషన్ల కోసమే విదుత చార్జీల పెంపు : టీడీపీ
విలేకరులతో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి

మడకశిరటౌన, అక్టోబరు 18: కమీషన్ల కోసమే వైసీపీ ప్రభుత్వం అధిక రేట్లతో విద్యుత కొనుగోలుచేసి ఆభారాన్ని పేదలపై మోపిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. సోమవారం బాలాజీనగర్‌లోని ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత ఛార్జీలు పెంచనని ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి అనేక సభల్లో మాట ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను విస్మరించి విద్యుత్తు వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన విద్యుత సబ్సిడీ విద్యుత సంస్థలకు ఇవ్వలేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత రేట్లు తగ్గుతున్నా విద్యుత  కొనుగోలు ధర రూ.3.12 రూపాయలకే లభిస్తోందన్నారు. అయినా కమీషన్లకోసం మార్కెట్‌లో రూ.6 నుంచి రూ.11 పెట్టి కొనుగోలు చేశారని, ఈ భారాన్ని వినియోగదారులపై మోపడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే చర్యలు వెంటనే విరమించుకోవాలని, ట్రూఆఫ్‌ ఛార్జీలు వెంటనేపూర్తిగా రద్దు చేయాలని, బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుతను కొనుగోలు చేయరాదన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు విద్యుత ఛార్జీలు పెంచరాదని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-19T04:48:21+05:30 IST