హైదరాబాద్‌ ఇళ్ల ధరల్లో 8% పెరుగుదల

ABN , First Publish Date - 2022-08-17T06:25:09+05:30 IST

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమా సికానికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా నమోదైందని ఓ నివేదిక వెల్లడించింది.

హైదరాబాద్‌ ఇళ్ల ధరల్లో 8% పెరుగుదల

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమా సికానికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస గృహాల ధరల పెరుగుదల సగటు 5 శాతంగా నమోదైందని ఓ నివేదిక వెల్లడిం చింది. ఇళ్లకు డిమాండ్‌తో పాటు నిర్మాణ వ్యయాలు కూడా పెరగడం ఇందుకు కారణాలని తెలిపింది. రియల్టీ రంగ సంఘం క్రెడాయ్‌, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ కొలియర్స్‌ ఇండియా, డేటా అనలిటిక్స్‌ సంస్థ లియాసెస్‌ ఫోరాస్‌ కలిసి ‘హౌసిం గ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ రిపోర్టు 2022’ను విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం.. సమీక్షా కాలానికి హైదరాబాద్‌లో గృహాల రేట్లు వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి చదరపు అడుగు సగటు ధర రూ.9,218కి చేరుకుంది. కాగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఇళ్ల ధరలు అత్యధికంగా 10 శాతం పెరిగాయి. 

Updated Date - 2022-08-17T06:25:09+05:30 IST