Domestic Workers: కువైత్‌లో అనూహ్య పరిణామం.. మొదటి స్థానం ఇండియాదే

ABN , First Publish Date - 2022-06-28T18:20:39+05:30 IST

గడిచిన రెండేళ్లు మహమ్మారి కరోనా కారణంగా కువైత్‌లో గృహ కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయింది.

Domestic Workers: కువైత్‌లో అనూహ్య పరిణామం.. మొదటి స్థానం ఇండియాదే

2022 మొదటి త్రైమాసికంలో భారీగా పెరిగిన డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య.. భారత్ నుంచే అధికం

కువైత్ సిటీ: గడిచిన రెండేళ్లు మహమ్మారి కరోనా కారణంగా కువైత్‌లో గృహ కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకానొక దశలో డొమెస్టిక్ వర్కర్లు దొరకకపోవడంతో అక్కడి వారు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అయితే, 2022 వారి కష్టాలకు చెక్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే భారీ మొత్తంలో ప్రవాస కార్మికులు కువైత్‌కు క్యూకట్టారు. ఇలా 2022 మొదటి త్రైమాసికంలో ఏకంగా 22 వేల కార్మికులు ఆ దేశానికి వెళ్లినట్లు తాజాగా అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్లు భారీ సంఖ్యలో కువైత్ చేరుకున్నారు. ఈ మూడు నెలల్లో కొత్తగా 19,532 మంది గృహ కార్మికులు పనిలో చేరినట్లు నివేదిక సారాంశం. వీరిలో అత్యధికులు ఆరు దేశాలకు చెందిన వారిగా రిపోర్టు పేర్కొంది. ఈ ఆరు దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాత వరుసగా ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, బెనిన్, సుడాన్ ఉన్నాయి. ఒక్క భారత్ నుంచే 11,591 మంది డొమెస్టిక్ వర్కర్లు కువైత్ వెళ్లారు. ఇక రెండో స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ నుంచి 5,631 మంది వెళ్లడం జరిగింది. 

Updated Date - 2022-06-28T18:20:39+05:30 IST