ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునకుగడువు పెంపు

ABN , First Publish Date - 2021-05-10T05:03:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం మునిసి పాలిటీలో నివాసాలు, వాణిజ్య సముదాయాలకు సం బంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021- 22 ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే లబ్ధిదారులకు ఐదు శాతం మినహాయింపునిస్తున్నది.

ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపునకుగడువు పెంపు

 - మే 31 వరకు గడువు పెంపు

- ఐదు శాతం మినహాయింపునకు అవకాశం

-  మునిసిపల్‌ ప్రజలకు ఊరట

నారాయణపేట, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం మునిసి పాలిటీలో నివాసాలు, వాణిజ్య సముదాయాలకు సం బంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021- 22 ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే లబ్ధిదారులకు ఐదు శాతం మినహాయింపునిస్తున్నది. గతేడాది మార్చిలోనే ఆర్థిక సంవత్సరం ముగియడంతో ముందుగా ఏప్రిల్‌ 30 వరకు చెల్లించిన వారికి ఐదు శాతం మినహా యింపు కల్పించిన ప్రభుత్వం మే 31వరకు గడువును పెంచింది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో గడువు పెంచడంతో అడ్వాన్స్‌ పన్ను చెల్లింపు దారులకు ఊర టనిస్తుంది. జిల్లాలో మక్తల్‌, కోస్గి, నారాయణపేట మునిసిపాలిటీలు ఉన్నాయి. ఆయా మునిసిపాలిటీల్లో ఉన్న గృహాలు, వాణిజ్య సముదాయాలకు సంబం ధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను ముందు గానే చెల్లిస్తే వారు చెల్లించే పన్నులో ఐదు శాతం మినహాయింపు లభిస్తుంది. గడువును ప్రభుత్వం పొ డిగించినా ఆయా మునిసిపాలిటీల్లో ఆశించిన ప్రచా రాన్ని అధికారులు కల్పించకపోవడం మరోవైపు కొవి డ్‌ విజృంభిస్తుం డడంతో అడ్వాన్స్‌ చెల్లింపునకు పెద్ద గా జనాలు ఆసక్తి చూపడం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ కమిషనర్‌కు అడ్వాన్స్‌ పన్ను చెల్లించే వెసులు బాటును కూడా కల్పించింది. ఉదాహరణకు ఏడాదికి సంబంధించిన ఇంటి పన్ను రూ.వెయ్యి ఉంటే ఐదు శాతం తగ్గింపు పోను రూ.950 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది 2020- 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో నారాయణపేట మునిసిపాలిటీలో రూ.3.71 కోట్లు పన్ను డిమాండ్‌కు గాను రూ.3.05 కోట్లు వసూళ్లు చేపట్టి 82 శాతం  లక్ష్యాన్ని సిబ్బంది అధిగమించారు. మక్తల్‌లో రూ.82 లక్షలకు గాను రూ.72 లక్షల పన్ను లు వసూలు చేసి 92 శాతం పన్నులు రాబట్టారు. కోస్గిలో రూ.42 లక్షలకు గాను రూ.34 లక్షలు పన్ను లు వసూలు చేసి 80శాతం పన్నులు రాబట్టారు. ఐతే 2021- 22 ప్రస్తుత కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి ఆస్తిపన్ను ముందస్తు చెల్లిస్తే ఐదు శాతం మినహాయింపు ఉండడంతో జిల్లాలోని పుర ప్రజలు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుర అధికార, పాలక యంత్రాంగం కోరుతోంది. 

Updated Date - 2021-05-10T05:03:18+05:30 IST