రోగనిరోధక శక్తి కోసం...

ABN , First Publish Date - 2020-07-23T22:22:06+05:30 IST

నలభై ఆరేళ్ల వయసులోనూ యువతులతో పోటీ పడే అందం, ఫిట్‌నెస్‌ మలైకా అరోరా సొంతం. తాజాగా ఆమె కరోనా వైరస్‌ బారిన పడకుండా రోగనిరోధకశక్తిని

రోగనిరోధక శక్తి కోసం...

ఆంధ్రజ్యోతి23-07-2020

నలభై ఆరేళ్ల వయసులోనూ యువతులతో పోటీ పడే అందం, ఫిట్‌నెస్‌ మలైకా అరోరా సొంతం. తాజాగా ఆమె కరోనా వైరస్‌ బారిన పడకుండా రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో చెబుతూ, తాను అనుసరిస్తున్న ఇమ్యూనిటీ బూస్టింగ్‌ డ్రింక్‌ తయారీని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలైకాస్‌ ట్రిక్‌ ఆర్‌ టిప్‌’ పేరుతో ఒక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మలైకా ఏమన్నారంటే...


‘‘లాక్‌డౌన్‌లో పాటించిన పద్ధతులను, లాక్‌డౌన్‌ తర్వాతా కొనసాగిస్తూ ప్రస్తుత సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మీద మరింత దృష్టి పెట్టాలి. ఇప్పుడు బయటి పరిస్థితిని చూస్తే ఆరోగ్యంగా ఉండడం, వ్యాధినిరోధక శక్తి మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఒక్కో విధానం అనుసరిస్తారు. నేను రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకునేందుకు మన ప్రాచీన ఆయుర్వేదంలో చెప్పిన డ్రింక్‌ను తాగుతున్నా. నీళ్లు తాజా ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలు, కొద్దిగా స్వచ్ఛమైన యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌  తీసుకోవాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి జ్యూస్‌ సిద్ధం చేసుకోవాలి. తర్వాత గ్లాసులో జ్యూస్‌ను వడబోయాలి. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిండెంట్లు ఎక్కువ మోతాదులో ఉండే ఈ డ్రింక్‌ను ప్రతిరోజు ఉదయం తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొవిడ్‌-19 విజృంభణతో ఇమ్యూనిటీ బూస్టింగ్‌ ఫుడ్‌, డ్రింక్స్‌ వాడకం పెరిగింది. ఇంటివద్దనే సులువుగా తయారుచేసుకొనే ఈ డ్రింక్‌ను తాగండి. ఆరోగ్యంగా ఉండండి.’’



Updated Date - 2020-07-23T22:22:06+05:30 IST