జీర్ణశక్తిని పెంచి.. బరువును తగ్గించే చిట్కా!

ABN , First Publish Date - 2021-11-07T17:16:00+05:30 IST

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి ఉపశమనానికి మిరియాలు చక్కగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి పనికొస్తాయి.

జీర్ణశక్తిని పెంచి.. బరువును తగ్గించే చిట్కా!

ఆంధ్రజ్యోతి(07-11-2021)

మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి ఉపశమనానికి మిరియాలు చక్కగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి పనికొస్తాయి. మిరియాలను తగిన మోతాదులో తీసుకుంటే జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పైపెరిన్‌ అనే మిశ్రమం జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి పెరిగేలా చేస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ సిస్టం బలోపేతం అవుతుంది. మిరియాలను వంటల్లో ఉపయోగించడమే కాకుండా టీ రూపంలో తయారుచేసుకుని తీసుకోవచ్చు.


ఎలా చేయాలంటే...

ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. 

నీళ్లు మరుగుతున్న సమయంలో ఒక టీస్పూన్‌ మిరియాలు, ఒక టీస్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా అల్లం వేయాలి. 

మరో ఐదు నిమిషాల పాటు మరిగిన తరువాత వడగట్టుకుని సిప్‌ చేయాలి.

రుచిగా ఉండాలనుకుంటే తేనె కలుపుకోవచ్చు.

Updated Date - 2021-11-07T17:16:00+05:30 IST