Dolo-650 manufacturer Micro Labలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

ABN , First Publish Date - 2022-07-07T00:06:27+05:30 IST

నగరంలోని ఔషధ తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ (Micro Labs Limited)

Dolo-650 manufacturer Micro Labలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

బెంగళూరు : నగరంలోని ఔషధ తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ (Micro Labs Limited) కార్యాలయాలపై ఆదాయపు పన్ను (Income Tax) శాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. దాదాపు 20 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ కంపెనీ డోలో-650 (Dolo-650) ఔషధాన్ని తయారు చేస్తుందనే సంగతి తెలిసిందే. 


ఆదాయపు పన్ను శాఖలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, దేశవ్యాప్తంగా 40 చోట్ల దాదాపు 200 మంది అధికారులు ఈ కంపెనీ కార్యాలయాల్లో సోదాల్లో పాల్గొన్నారు. న్యూఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాలలోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల నివాసాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. 


బెంగళూరులోని మాధవ నగర్, రేస్‌ కోర్స్ రోడ్డులో ఉన్న మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయంలో కొన్ని దస్తావేజులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ కంపెనీ 350 కోట్ల మాత్రలను విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులందరినీ అణగదొక్కి రూ.400 కోట్లు సంపాదించినట్లు సమాచారం. 


Updated Date - 2022-07-07T00:06:27+05:30 IST