Income Tax payers alert: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అలర్ట్

ABN , First Publish Date - 2022-08-12T15:57:34+05:30 IST

అటల్ పెన్షన్ యోజనలో చేరదల్చుకున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తం(Income Tax payers alert) కావాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ(Ministry of Finance) కోరింది....

Income Tax payers alert: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ అలర్ట్

అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి 50 రోజుల గడువు

న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజనలో చేరదల్చుకున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అప్రమత్తం(Income Tax payers alert) కావాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ(Ministry of Finance) కోరింది.టాక్స్ పేయర్లు(income taxpayers) అటల్ పెన్షన్ యోజనలో(Atal Pension Yojana) చేరడానికి 50 రోజుల గడువు మాత్రమే ఉందని కేంద్రం తెలిపింది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హులు కాదని తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.( gazette notification issued by the Ministry of Finance)


అక్టోబర్‌ నుంచి అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది.పన్ను చెల్లించే పౌరులు అటల్ పెన్షన్ యోజన (APY) పథకంలో చేరాలని అనుకుంటే సెప్టెంబర్ 30వతేదీ చివరి తేదీ అని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది.ఎవరైనా అక్టోబర్ 1వతేదీ లేదా ఆ తర్వాత అటల్ యోజన పథకంలో చేరి, కొత్త రూల్ అమల్లోకి వచ్చిన తేదీ లేదా అంతకు ముందు ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా గుర్తిస్తే వారి ఖాతా వెంటనే మూసివేస్తామని కేంద్రం తెలిపింది.


అయితే అప్పటి వరకు డిపాజిట్ చేసిన పెన్షన్ మొత్తాన్ని ఒక్కసారిగా వాపసు చేస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 మే9వతేదీన అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రతను అందించడం లక్ష్యంగా అటల్ యోజన పథకాన్ని ప్రారంభించారు.అటల్ యోజన పథకం చందాదారులు సెక్షన్ 80 సీసీడీ, 80 సీసీఈ కింద వారి కంట్రిబ్యూషన్‌పై పన్ను ప్రయోజనాలు పొందుతారు.

Updated Date - 2022-08-12T15:57:34+05:30 IST