గొంగ్లూరులో ఆదాయపు పన్ను అధికారుల పర్యటన

ABN , First Publish Date - 2021-09-19T04:18:37+05:30 IST

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏపీ అండ్‌ టీఎస్‌ ఆదాయపు పన్నుశాఖ చీఫ్‌ కమిషనర్‌ జివి.హేమలతాదేవి, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జి.నర్సమ్మ, కమిషనర్‌ ఎస్‌.ప్రవీణ, అదనపు కమిషనర్‌ డీజేపీ ఆనంద్‌, జాయింట్‌ కమిషనర్‌ తోట సుబ్రహ్మణ్యంతో కూడిన అధికారుల బృందం పుల్‌కల్‌ మండలంలోని గొంగ్లూరు (గాంధీ గ్రామ సేవా కేంద్రం) గ్రామంలో శనివారం పర్యటించింది.

గొంగ్లూరులో ఆదాయపు పన్ను అధికారుల పర్యటన
గొంగ్లూరులో పర్యటిస్తున్న అధికారులు

గ్రామంలో పలు అభివృద్ధి పనుల పరిశీలన

పుల్‌కల్‌, సెప్టెంబరు 18 : ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏపీ అండ్‌ టీఎస్‌ ఆదాయపు పన్నుశాఖ చీఫ్‌ కమిషనర్‌ జివి.హేమలతాదేవి, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జి.నర్సమ్మ, కమిషనర్‌ ఎస్‌.ప్రవీణ, అదనపు కమిషనర్‌ డీజేపీ ఆనంద్‌, జాయింట్‌ కమిషనర్‌ తోట సుబ్రహ్మణ్యంతో కూడిన అధికారుల బృందం పుల్‌కల్‌ మండలంలోని గొంగ్లూరు (గాంధీ గ్రామ సేవా కేంద్రం) గ్రామంలో శనివారం పర్యటించింది. గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండేళ్లలో మహిళల సాధికారత, పారిశుధ్యం, పచ్చదనం, విద్య, వైద్యం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవలే మహిళల స్వయం ఉపాధి కోసం స్థానికంగా సర్వోదయ మహిళ ఎంటైర్‌ ప్రైజెస్‌ పేరుతో స్వయం ఉపాధికి కుటీర పరిశ్రమను నెలకొల్పారు. గ్రామంలో పర్యటించిన అధికారులు అనంతరం స్థానిక పెద్దచెరువు కట్టపై మొక్కలు నాటి వాటి రక్షణ కంచెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్లు ముకాంబికేయన్‌, స్వరూప్‌ మన్నవా, మరో 70 మంది సీనియర్‌, జూనియర్‌ అధికారులు, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, గ్రామ దత్తత సమన్వయ కర్త పి.సుధాకర్‌నాయక్‌, డీపీవో వి.సురేశ్‌మోహన్‌, ఎంపీడీవో ఎం.మధులత, సర్పంచ్‌ రాంసాని లక్ష్మీరామచంద్రారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ పల్లె సరోజసంజీవయ్య, ఎంపీటీసీ చిత్రగోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ విఠల్‌, ఆత్మ డైరెక్టర్‌ బ్రహ్మానందారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:18:37+05:30 IST