Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 20 Sep 2021 23:49:45 IST

kdp: గండికి రూ.27 లక్షల ఆదాయం

twitter-iconwatsapp-iconfb-icon
kdp: గండికి రూ.27 లక్షల ఆదాయంహుండీల డబ్బులను లెక్కిస్తున్న అధికారులు, సిబ్బంది

కడప:  చక్రాయపేట గండి వీరాంజనేయస్వామి దేవస్థానంలో హుండీల ద్వారా రూ.27 లక్షలు వచ్చినట్లు సోమవారం సహాయ కమిషనర్‌ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. సోమవారం హుండీలను ఏసీ ఆధ్వర్యంలో లెక్కించారు. రూ.27,00,971 ఆదాయం వచ్చింది. సాధారణంగా శ్రావణ మాసోత్సవాల్లో దాదాపు రూ.33 లక్షల ఆదాయం వచ్చేది. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా ఉత్సవాలు జరగనప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. నగదుతో పాటు 17.300 గ్రాముల బంగారం, 1.350 కేజీ వెండిని భక్తులు సమర్పించినట్లు ముకుందరెడ్డి తెలిపారు. దేవస్థాన ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు సంప్రదాయ వస్త్రధారణతో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, ఉప ప్రధాన అర్చకులు రాజా, అయ్యంగార్‌ స్వామి, జిల్లా దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనార్ధన్‌, చక్రాయపేట ఏపీజీ బ్యాంకు మేనేజర్‌ అశోక్‌కుమార్‌, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.