Abn logo
Oct 24 2021 @ 00:33AM

‘జగనన్న పాలవెల్లువ’తో మహిళలకు ఆదాయం: కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

నార్పల, అక్టోబరు 23: ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమంతో మహిళలకు ఆదాయం లభిస్తుందని కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మండలంలోని దిగుమర్రి గ్రామంలో ఈ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పాడిపశువుల పెంప కం ఏళ్లకాలంగా అందరూ చేస్తున్నా లాభాలు పొందడం లేదన్నారు. జగనన్న పాలవెల్లువ ద్వారా ప్రవేశపెట్టిన నూతన విధానంతో మహిళలను ప్రమోటర్లుగా నియమించి వారి ద్వా రా పాల సేకరణ చేసి వచ్చే అధిక ఆదాయాన్ని తిరిగి వారికే పంచడం జరుగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 300 గ్రా మాలను అమూల్‌ సంస్థ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాస్థాయి వరకు మిల్క్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని పాల సేకరణ చేస్తామన్నారు. డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువలో భాగంగా దిగుమర్రి, నరసాపురం గ్రామాల పరిధిలోని 280 మంది పాల ఉత్పత్తిదారుల సర్వే చేశామన్నారు. ఇందు లో 11 మందిని ప్రమోటర్లుగా ఎంపిక చేశామన్నారు. జగనన్న పా లవెల్లువ ద్వారా వచ్చే లాభాల గురించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీధర్‌ మూర్తి, ఎంపీడీఓ దివాకర్‌, ఈఓఆర్డీ లక్ష్మీనరసింహ, ఎంపీటీసీ శారద, సర్పంచ శివలక్ష్మమ్మ పాల్గొన్నారు.