వదలని వర్షాలు

ABN , First Publish Date - 2020-10-20T06:50:58+05:30 IST

పోలవరంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు కూలి వాహనాల

వదలని వర్షాలు

కాల్వలను తలపిస్తున్న రోడ్లు

 పెరుగుతున్న పంట నష్టాలు

పోలవరం, అక్టోబరు 19: పోలవరంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు కూలి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కురిసిన వర్షానికి ప్రాజెక్టు ఎగు వ గ్రామాలకు వెళ్లే రోడ్డు బురదమయంగా మారండంతో పాటు, స్పిల్‌వే ప్రాంతంలో వరదలకు పడ్డ గండి ప్రాంతంలో నీటి మట్టం పెరిగి రాకపోకలకు పూర్తి స్థాయి లో అంతరాయం ఏర్పడింది. 


పోల వరం పంచాయతీ బెస్తావీధిలో సుమారు 60 కుటుంబాలు 15 రోజులుగా 3అడుగుల లోతు వర్షపునీటిలో జీవనం సాగిస్తూ ఇబ్బం దులకు గురవుతున్నారు. కురుస్తున్న వర్షాలకు కొండవా గులు పొంగి ప్రవహించి పట్టిసీమ అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌, కడెమ్మ స్లూయిజ్‌ల ద్వారా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజానీకం అవస్థలకు గురయ్యారు.


Updated Date - 2020-10-20T06:50:58+05:30 IST