ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడ తెరిపిలేని వర్షం

ABN , First Publish Date - 2022-07-05T04:23:17+05:30 IST

మండలంలో ఆది, సోమవా రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తీగల ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో పెంచికలపేట- బెజ్జూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తం భించి పోయాయి.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడ తెరిపిలేని వర్షం
బెజ్జూరులో ఉప్పొంగి ప్రవహిస్తున్న తీగల ఒర్రె

- ఉప్పొంగిన తీగల ఒర్రె

- స్తంభించిన రాకపోకలు

బెజ్జూరు, జూలై 4: మండలంలో ఆది, సోమవా రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తీగల ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో పెంచికలపేట- బెజ్జూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తం భించి పోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న ఏకదాటి వర్షానికి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డుపైనే గంటల తరబడి నిలిచిపోయాయి. దీంతో పలు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీగల ఒర్రెపై వంతెన లేకపోవడంతో వర్షం కురిసినప్పునడల్లా గంటల తర బడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. బారెగూడ గ్రామానికి చెందిన రైతు చౌదరిగంగాధర్‌ ఇంటిగోడలు సోమవారం కూలిపోయాయి. ప్రస్తుతం అతను ఉండ డానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

చింతలమానేపల్లి: మండలవ్యాప్తంగా ఆది, సోమవా రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దిందా- కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగు నీటి ఉధృతితో ఉప్పొంగి ప్రవహించడంతో దిందా గ్రామానికి రాకపోకలు నిలిచిపో యాయి. వర్షానికి గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లన్నీ చిత్తడిగా మారాయి.

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఆదివారం నుంచి వర్షం కురిసింది. దీంతో లారీ చౌరస్తా, రాజీవ్‌గాంధీ చౌరస్తాలో వర్షం నీరు అఽధికంగా చేరింది. అలాగే రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం వరకు చిరుజల్లులు కురిశాయి.

Updated Date - 2022-07-05T04:23:17+05:30 IST