ఐనాక్స్ లీజర్... 15 శాతం పెరిగిన షేర్లు...

ABN , First Publish Date - 2021-07-27T23:48:27+05:30 IST

ఐనాక్స్ లీజర్ షేర్లు మంగళవారం ఇంట్రా డే ట్రేడ్‌లో 15 శాతం పెరిగి రూ. 347.50 లకు చేరుకున్నాయి.

ఐనాక్స్ లీజర్... 15 శాతం పెరిగిన  షేర్లు...

ముంబై : ఐనాక్స్ లీజర్ షేర్లు మంగళవారం ఇంట్రా డే ట్రేడ్‌లో 15 శాతం పెరిగి రూ. 347.50 లకు చేరుకున్నాయి. భారతీయ చలనచిత్ర, మీడియా వ్యాపారంలో అమెజాన్ వాటాను కొనుగోలు చేయనుందంటూ వార్తలు వస్తోన్న నేపధ్యంలో  ఐనాక్స్ షేర్ల ధరలు పెరిగిపోయాయి.


ఐనాక్స్ లీజర్ స్టాక్ ధర జనవరి 2021 నుంచి అత్యధిక స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 12:56 గంటలకు, ట్రేడింగ్ వాల్యూమ్స్‌లో 10 రెట్లు జంప్ చేసి, రూ. 320 వద్ద ట్రేడవుతోంది.  కంపెనీ మొత్తం ఈక్విటీలో ఏడు శాతం రిప్రెజెంట్ చేసి, 8.6 మిలియన్ ఈక్విటీ షేర్లు మధ్యాహ్న సమయానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ కౌంటర్‌లలో చేతులు మారాయి. 

Updated Date - 2021-07-27T23:48:27+05:30 IST