విజయసంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కవిందర్‌గుప్త
ఏసీసీ, జూలై 2: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుం దని జమ్ము కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్‌గుప్తా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్‌లో నిర్వహించే విజయ సంకల్ప సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింద న్నారు. ఈ నెల 3న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్రమోదీ నాయ కత్వంలో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్నారాజ సిసోడియా, రమేష్, హేమాజి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.