శింగరకొండలో భక్తుల విశ్రాంతిశాల ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-19T05:42:38+05:30 IST

శింగరకొండ శ్రీ ప్ర సన్నాంజనేయస్వామి దేవాల యం వద్ద బాలినేని వెంకటే శ్వరరెడ్డి, రమాదేవిల జ్ఞాప కార్థం సుమారు రూ.30 లక్ష ల సొంత నిధులతో నిర్మించి న భక్తుల విశ్రాంతి షెడ్‌ను మాజీ మంత్రి, ఒంగోలు ఎ మ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి గురువారం మధ్యహ్నాం ప్రారం భించారు.

శింగరకొండలో భక్తుల విశ్రాంతిశాల ప్రారంభం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న బాలినేని దంపతులు. పక్కన మేదరమెట్ల శంకరారెడ్డి, కృష్ణచైతన్య, కోట శ్రీనివాసకుమార్‌

పాల్గొన్న బాలినేని దంపతులు

ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శింగరకొండ(అద్దంకి), ఆ గస్టు 18: శింగరకొండ శ్రీ ప్ర సన్నాంజనేయస్వామి దేవాల యం వద్ద బాలినేని వెంకటే శ్వరరెడ్డి, రమాదేవిల జ్ఞాప కార్థం సుమారు రూ.30 లక్ష ల సొంత నిధులతో నిర్మించి న భక్తుల విశ్రాంతి షెడ్‌ను మాజీ మంత్రి, ఒంగోలు ఎ మ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, శచీదేవి గురువారం మధ్యహ్నాం ప్రారం భించారు. ముందుగా శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో  బా లినేని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దేవస్థానం చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘునాధరెడ్డి వారిని ఘనంగా సన్మా నించారు. అనంతరం కొండపైన ఉన్న శ్రీలక్ష్మీనరశింహస్వామి దేవాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్య క్రమంలో శాప్‌నెట్‌ చె ౖర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ చార్జి బాచిన కృష్ణచైతన్య,  పీడీ సీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరారెడ్డి, దేవస్థానం చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, ఈవో రఘునాధరెడ్డి, మాజీ ఎంపీపీ జ్యోతి హ నుమంతరావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, అవి శన ప్రభాకరరెడ్డి, సందిరెడ్డి రమేష్‌, సర్పంచ్‌ ఎర్రిబోయిన తిరుప తయ్య, దేసు పద్మేష్‌,  శ్రీనివాసరెడ్డి, రామి రెడ్డి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఎవరిదారి వారిదే...

మాజీ  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శింగరకొండ వచ్చిన సందర్భంగా పాలక మండలి చైర్మన్‌, సభ్యులు, ఈవో ఎవరి దారి వారిదేగా వ్యవహరించటం చర్చనీ యాంశంగా మారింది. బాలినేని ప్రస న్నాంజనేయస్వామి దేవాలయం వద్దకు వచ్చిన సమయంలో  కృష్ణచైతన్యతో పా టు ఈవో రఘునాధరెడ్డి, పలువురు వైసీ పీ నాయకులు ముందుగా వెళ్ళి స్వాగతం పలకగా, దక్షిణ రాజగోపురం వద్దకు వచ్చిన తరువాత చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, కొంతమంది పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ముందుగా కృష్ణచైతన్య దేవాలయం వద్దకురాగా ఈవో రఘునాధ రెడ్డి, కొంత  మంది పాలకమండలి సభ్యులు వెళ్ళి స్వాగతం  పలికారు. చై ర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌, మరికొంత మంది కమిటీ సభ్యులు సమీ పంలోనే ఉన్నప్పటికీ అటువైపు వెళ్ళలేదు. ఒకే ప్రాంతంలో ఎవరికి వా రే ప్రత్యేకంగా వేచి ఉండటం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-08-19T05:42:38+05:30 IST