అయ్యప్ప మాలధారణ స్వీకరించిన భక్తులు
అనంతగిరి, జనవరి 26: మండల కేంద్రంలోని అనంతగిరి గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ఠోత్సవ పూజలు బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 11 రోజుల దీక్షను మండంలోని 400 స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాలధారులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఐదో తేదీన అయ్యప్ప ఆలయ విగ్రహ ప్రతిష్ఠ సజావుగా సాగడానికి దీక్ష తీసుకున్నట్లు తెలిపారు.