వైసీపీ పాలనలో దగాపడ్డ యువత

ABN , First Publish Date - 2021-06-22T07:00:16+05:30 IST

వైసీపీ పాలనలో నిరుద్యోగ యువత, ఉద్యోగులు దగా పడ్డారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ప్రభుత్వం పది వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటించిందన్నారు. డీఎస్సీ ఊసేలేదని, సీపీఎస్‌ రద్దు గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో దగాపడ్డ యువత
గొట్టిపాటి రవికుమార్‌

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి, జూన్‌ 21: వైసీపీ పాలనలో  నిరుద్యోగ యువత, ఉద్యోగులు దగా పడ్డారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  లక్షల ఉద్యోగాలు ఖాళీలు  ఉంటే ప్రభుత్వం పది వేల ఉద్యోగాలను భర్తీ  చేసేందుకు ప్రకటించిందన్నారు. డీఎస్సీ ఊసేలేదని, సీపీఎస్‌ రద్దు గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగ  విప్లవం తెస్తామని  మాట ఇచ్చి ఇప్పుడు  నిరుద్యోగులను నిండా ముంచారన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన వలంటీర్‌ల పోస్టులను, ఆర్టీసీ విలీనంతో లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపించటం హేయమన్నారు. రెండు సంవత్సరాలు  గడుస్తున్నా ఇంతవరకు డీఎస్సీ ఊసేలేదని గొట్టిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలలో 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ  లెక్కల్లో చూపలేదన్నారు. ప్రభుత్వ విధానాలతో అనేక మంది ఉపాధి కోల్పోయారన్నారు. అమరావతి నిర్మాణం నిలిపివేయటంతో 60 వేల మంది కార్మికులు  ఉపాధి కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర  వ్యాప్తంగా ప్రభుత్వ విధానాలతో అనేక పరి శ్రమలు  మూతపడి వేలాది మంది యువత ఉపాధి కోల్పోయారన్నారు. గ్రానైట్‌ క్వారీలు, పాలిషింగ్‌ యూనిట్‌లు మూతపడ్డాయన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగులకు 20  శాతం పైగా ఐఆర్‌ ఇచ్చిందన్నారు. ఇప్పుడు డీఏ, పీఆర్‌సీ ప్రస్తావనే లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నెలరోజులలోనే సీపీఎ్‌సను రద్దు చేస్తానని హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇంత వరకు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రశ్నించారు. 2018-19లో రాష్ట్రంలో నిరుద్యోగ  రేటు 3.6 శాతం ఉంటే  ఇప్పుడు 13.5 శాతంకు  పెరిగిందన్నారు.


Updated Date - 2021-06-22T07:00:16+05:30 IST