వివేకా హత్యలో ప్రముఖులు

ABN , First Publish Date - 2020-02-21T09:18:20+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రాజకీ య ప్రముఖులున్నారని, ఇందులో ఐదుగురు ముఖ్య నేతల జోక్యముందని పిటిషనర్లు...హైకోర్టుకు తెలిపా

వివేకా హత్యలో ప్రముఖులు

ఐదుగురు ముఖ్యనేతల ప్రమేయం

ముఖ్యమంత్రి చేతుల్లో పోలీస్‌ ఫోర్స్‌ 

కేసును తారుమారుచేసే అవకాశం 

అందుకే సీబీఐకి కేసును ఇవ్వండి

సీనియర్‌ న్యాయవాదుల వాదనలు

అనుమానాలొద్దు.. సాఫీగా దర్యాప్తు: ఏజీ

ప్రభుత్వం తరఫున ఏజీ వివరణలు

సీల్డ్‌ కవర్లలో వివరాలు హైకోర్టుకు

వివేకానంద కేసుడైరీ,జనరల్‌ డైరీ  తమ ముందుంచాలన్న న్యాయమూర్తి

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రాజకీ య ప్రముఖులున్నారని, ఇందులో ఐదుగురు ముఖ్య నేతల జోక్యముందని పిటిషనర్లు...హైకోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన జగన్‌.. సీఎం అయ్యాక ఇప్పుడెందుకు తన పిటిషన్‌పై ఎలాంటి తీర్పు అవసరం లేదని చెబుతున్నార ని ప్రశ్నించారు. పోలీసు యంత్రాంగమంతా సీఎం చే తుల్లో ఉందని, అందువల్ల ఆయన కేసును తారుమా రు చేసే అవకాశముందని ఆరోపించారు. అందువల్ల ఈ కేసులో నిజానిజాలు తేలాలంటే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. మరోవైపు ద ర్యాప్తు సాఫీగా సాగుతోందని, ఎలాంటి అనుమానాల కు తావు లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందని, మరో రెండు నెలల్లో నే పూర్తవుతుందని పేర్కొంది.


అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన పని లేదని వివరించిం ది. కాగా, సీఎంపై పిటిషనర్లు లేవనెత్తిన ఆరోపణలపై వాదనలు వినిపించేందుకు జగన్‌ తరఫు న్యాయవాదికి అవకాశం క ల్పించారు. అదేవిధంగా వివేకా హ త్య కేసులో జనరల్‌ డైరీ, కేసు డైరీలను తమ ముందుంచాలని అడ్వకే ట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాంను న్యాయమూర్తి ఆదేశించారు. వివేకా హత్య కేసును సీబీఐకి లేక స్వతంత్ర దర్యా ప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతూ గ తంలో వివేకా సతీమణి సౌభాగ్య మ్మ, నాటి ప్రతిపక్షనేత జగన్‌, టీడీ పీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మం త్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వివేకా కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే భావన వ్యక్తం చేస్తూ మరో పిటిషన్‌ వేశారు. వీటిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. సౌభాగ్యమ్మ, సునీతల తరఫున హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి, ఆదినారాయణరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. 


సీబీఐ వద్దు.. కావాలి: ఏజీ-లాయర్ల వాదన 

‘‘హత్యాస్థలిలో లభ్యమైన లేఖపై ఉన్న చేతిరాత ఎ వరిదో తేల్చేందుకు మంగళగిరిలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(సీఎ్‌ఫఎ్‌సఎల్‌)కు పంపించాం. రెండో అభిప్రాయం కోసం హైదరాబాద్‌లోని సీఎ్‌ఫఎ్‌సఎల్‌కూ పంపించాం. హైదరాబాద్‌ నుంచి నివేదిక రావాల్సి ఉంది. అది అందితే కేసులో స్పష్టత వచ్చే అవకాశముంది. సిట్‌ దర్యాప్తు సాఫీగా సాగుతోంది. దర్యాప్తు ఆలస్యమవుతోందని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరడం సమంజసం కాదు. దర్యాప్తులో ఏవేని సందేహా లు ఉంటే తొలిగా మేజిస్ట్రేట్‌ ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దర్యాప్తు మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశముంది. ఇప్పటి వరకూ సిట్‌ చేపట్టి న దర్యాప్తుపై నివేదికను, సిట్‌ స భ్యుల వివరాలను వేర్వేరు సీల్డ్‌ కవర్లలో అప్పగిస్తున్నాం. పరిశీలించండి’’ అని ఏజీ శ్రీరామ్‌ కోరారు. దర్యాప్తు వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాల్సిన అవసరం ఏంటి.. దర్యాప్తులో ఎందుకంత రహస్యమని సీనియర్‌ న్యాయవాది బసంత్‌ ప్రశ్నించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ప్రభు త్వం ఇలాంటి పనులకు దిగిందని ఆరోపించారు.


‘‘వివేకా హత్య కేసులో ఆయన సన్నిహి త బంధువు హస్తం ఉందని మాకు అనుమానం. ఇవ న్నీ తేలాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి. ఇప్పటి వరకూ కనీసం ఒక్క క్లూ కూడా సిట్‌ సంపాదించలేదు. ఈ హత్యలో కొంతమంది శక్తివంతమైన రాజకీయ ప్రముఖుల ప్రమేయం వుంది. రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా సీఎం చేతిలో ఉన్నందున ఈ కేసును తారుమారు చేసే అవకాశముంది. అందుకే కోర్టు జోక్యం చేసుకుని కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’ అని కోరారు. వివేకా హత్యలో రాజకీయ ప్రముఖులున్నారని, ఇందులో ఐదుగురు బడా నేతల జోక్యముందని సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి పేర్కొన్నారు. తేలిగ్గా వదిలేయాల్సిన సాధారణ కేసు కాదిదన్నారు. ‘‘సత్వర విచారణ కోరుతున్న మాపైనే పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. మా వల్లనే దర్యా ప్తు ఆలస్యమవుతున్నదని నిందిస్తున్నారు. మృతుని భార్య పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు ప్రభుత్వం మౌ నం దాల్చింది. ఇప్పుడు కుమార్తె, అల్లుడు సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాకే మాపై పోలీసులు నిందారోపణ క్రీడ మొదలుపెట్టారు’’ అని వీరారెడ్డి ఆరోపించారు. 

Updated Date - 2020-02-21T09:18:20+05:30 IST