అమ్మ బాబోయ్.. పామును ఇలా కూడా ఉపయోగిస్తారా? ఈ మహిళ ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2021-12-23T22:25:20+05:30 IST

ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ‘అమ్మబాబోయ్.. పాములను ఇలా కూడా ఉపయోగిస్తారా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. వైరల్ వీడియోలో ఏముంది

అమ్మ బాబోయ్.. పామును ఇలా కూడా ఉపయోగిస్తారా? ఈ మహిళ ఏం చేసిందో చూడండి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ‘అమ్మబాబోయ్.. పాములను ఇలా కూడా ఉపయోగిస్తారా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. వైరల్ వీడియోలో ఏముంది, సదరు మహిళ పామును ఎందుకోసం ఉపయోగించింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


సాధారణంగా మహిళలు రకరకాల హెయిర్ స్టైల్స్‌, వస్త్రధారణతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం భిన్నంగా ఆలోచించింది. నలుగురిలోకి వెళ్లినపుడు ప్రత్యేకంగా కనిపించడం కోసం, ఆ నలుగురూ తన గురించి మాట్లాడుకోవడం కోసం ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్‌లా ఉపయోగించింది. జడకొప్పుకు కొండ చిలువ పిల్లను హెయిర్ బ్యాండ్‌లా కట్టుకుని షాపింగ్ మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడున్న కస్టమర్లు ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 






Updated Date - 2021-12-23T22:25:20+05:30 IST