గ్రామాలలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2021-07-25T05:38:56+05:30 IST

గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లింగసముద్రం పోలీసు స్టేషన్‌ను ఆమె సందర్శించారు. పోలీ్‌సస్టేషన్‌లో లాకప్‌ రూమ్‌, రికార్డు రూం, కంప్యూటర్‌ రూంలను తనిఖీ చేశారు. అలాగే పోలీ్‌సస్టేషన్‌లో సిబ్బంది కొరత గురించి, వారి సమస్యల గురించి ఎస్సై రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇసుక రీచ్‌ల గురించి అడగ్గా, వీఆర్‌ కోటలో ఇంతకు ముందు అధికారిక రీచ్‌ ఉండేదని, ప్రస్తుతం అది కూడా లేదని ఎస్సై రమేష్‌ చెప్పారు.

గ్రామాలలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
మాలకొండలో ఆలయ ప్రత్యేకతను అధికారులను అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ


- పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి

- పోలీస్‌స్టేషన్ల పరిశీలన సందర్భంగా ఎస్పీ మలిక గర్గ్‌

లింగసముద్రం, జూలై 24 : గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం లింగసముద్రం పోలీసు స్టేషన్‌ను ఆమె సందర్శించారు.  పోలీ్‌సస్టేషన్‌లో లాకప్‌ రూమ్‌, రికార్డు రూం, కంప్యూటర్‌ రూంలను తనిఖీ చేశారు. అలాగే పోలీ్‌సస్టేషన్‌లో సిబ్బంది కొరత గురించి, వారి సమస్యల గురించి ఎస్సై రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఇసుక రీచ్‌ల గురించి అడగ్గా, వీఆర్‌ కోటలో ఇంతకు ముందు అధికారిక రీచ్‌ ఉండేదని, ప్రస్తుతం అది కూడా లేదని ఎస్సై రమేష్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మహిళా పోలీసులతో మాట్లాడుతూ, గ్రామాలలో ఏదైనా నేరం జరిగితే వెంటనే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఆమె పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మహిళా పోలీసులతో కలిసి మొక్కను నాటారు. 

 గుడ్లూరు : అపరిచితులు, నేరస్థుల పట్ల మహిళపోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మలికా గర్గ్‌ అన్నారు. ఇటీవల జిల్లా ఎస్పీ నేతృత్వంలో మహిళ పోలీసులకు నిర్వహిస్తున్న దిశా నిర్ధేశం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గుడ్లూరు పోలీస్టేషన్‌ను శనివారం సందర్శించారు. పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.  పోలీస్టేషన్‌ ప్రాంగణంలో కావలి రోడ్డువైపుగా నూతన గదులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎస్పీకి తెలియజేశారు.

ఉలవపాడు : స్థానికంగా భౌగోళిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ మహిళా పోలీసులకు సూచించారు. శనివారం ఉలవపాడు పోలీస్‌ స్టేషన్‌ను ఆమె సందర్శించారు. తొలుత సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనం చేశారు. ఎస్సై పీ విశ్వనాఽథ్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వ్యక్తిగత సర్వీస్‌, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దిశా యాప్‌ను ప్రతి మహిళ స్మార్ట్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించే బాధ్యత మహిళా పోలీసులదేనన్నారు. 

వలేటివారిపాలెం : పోలీసులంటే ప్రజలలో భయం వీడి, ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసులుగా మెలగాలని ఎస్పీ మలికా గర్గ్‌ సూచించారు. వలేటివారిపాలెం పోలీ్‌సస్టేషన్‌ను శనివారం ఆమె సందర్శించారు. స్టేషన్‌లో ఆహ్లాదకరంగా ఉన్న మొక్కలను చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు.  సిబ్బంది వివరాలు, సమస్యలను  ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయ మహిళా పోలీసులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రజల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తిస్తూ ప్రజలు మన్ననలు పొందాలన్నారు.  గ్రామాలలో భూవివాదాలు చోటుచేసుకోకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో పరిష్కరించే దశగా చర్యలు చేపట్టాలన్నారు.

మాలకొండను సందర్శించిన ఎస్పీ

మాలకొండ (వలేటివారిపాలెం) : పచ్చని చెట్లు, ఎతైన కొండల నడుమ వెలసిన నృసింహస్వామిని ఎస్పీ మలికగర్గ్‌ శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ గర్భగుడిలో ప్రధాన అర్చకులు గిరి, దుర్గలు ఎస్పీకి అష్టోత్తర ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పూలమాల, శాలువాతో సత్కరించారు. ఆలయ విశిష్టతను ఆలయ కార్యనిర్వాహణాదికారిని అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.   అనంతరం అయ్యవారిపల్లె సర్పంచ్‌ దంపతులు డేగా వెంకటేశ్వర్లు అమ్మవారి చీర, జాకెట్‌ ఎస్పీకి అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.  కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కే.బీ. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక ఎస్పీ వెంట వివిధ కార్యక్రమాల్లో డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐలు శ్రీరామ్‌, కే.శ్రీనివాసరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఎస్‌ఐలు సుదర్శన్‌యాదవ్‌, మల్లికార్జున,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:38:56+05:30 IST