Abn logo
Sep 25 2020 @ 01:40AM

రెండు కొత్త సినిమాల్లో

Kaakateeya

తొలి చిత్రం విడుదలవకుండానే మరో రెండు చిత్రాల్లో అవకాశం... అదికూడా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ లాంటి దిగ్గజ సంస్థలో అంటే మాటలు కాదు. ఆ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న అందాల నటి శార్వరీ. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ద ఫర్‌గాటన్‌ ఆర్మీ’ వెబ్‌సిరీస్‌లో శార్వరీ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం యశ్‌రాజ్‌ సంస్థ నిర్మిస్తోన్న ‘బంటీ ఔర్‌ బబ్లీ సీక్వెల్‌లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఆ చిత్రం విడుదల కాలేదు. అయినా ఆమె వర్క్‌ నచ్చడంతో ఆదిత్యాచోప్రా తాను తీయబోయే మరో రెండు కొత్త చిత్రాలకు శార్వరీని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇందులో ఒకటి భారీ చిత్రం. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు నిర్మాణ సంస్థ ఇంకా వెల్లడించలేదు. 

Advertisement
Advertisement