మూడేళ్ల పాలనలో అప్పుల్లో మునిగిన రాష్ట్రం

ABN , First Publish Date - 2022-07-04T06:24:59+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నిత్యావసర వస్తువులు, ఇసుక, మద్యం, కరెంట్‌, ప్రస్తుతం ఆర్టీసీ చార్జీలు ఇలా అన్నింటి ధరలు పెరిగి పోయాయని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. తిమ్మరాజుపేటలో ఆదివారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

మూడేళ్ల పాలనలో అప్పుల్లో మునిగిన రాష్ట్రం
నిరసన ర్యాలీలో బుద్ద, ప్రగడ, ఆడారి మంజు తదితరులు

  తిమ్మరాజుపేట ‘బాదుడే బాదుడు’లో వైసీపీ సర్కారు తీరును ఎండగట్టిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద 

జగన్‌ వైఫల్యాలపై పలువురు నిప్పులు

మునగపాక, జూలై 3 : వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నిత్యావసర వస్తువులు, ఇసుక, మద్యం, కరెంట్‌, ప్రస్తుతం ఆర్టీసీ చార్జీలు ఇలా అన్నింటి ధరలు పెరిగి పోయాయని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. తిమ్మరాజుపేటలో ఆదివారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగడాల చేతపూని మహిళలు, యువకులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ఏర్పడిం దన్నారు. ఎన్నికలు ఎప్పుడోస్తాయా.. చంద్ర బాబునాయుడ్ని ఎప్పుడు ముఖ్య మం త్రిని చేద్దామా అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రజలంతా ఉన్నా రన్నారు.  పరిపాలనా అనుభవం లేక  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రా న్ని అప్పుల ఊబి లోకి నెట్టారన్నారు.  టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వక, అభివృద్ధి పనులకు నిధులు లేక అన్ని రంగాల్లో రాష్ట్రం దివాళా తీసిందన్నారు. తెలుగు మహిళా జిల్లా  అధ్యక్షురాలు ఆడారి మంజు మాట్లాడుతూ మహిళలపై రోజు రోజుకి అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో కనీస బాధ్యత తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమరశెట్టి శ్రీను, బీవీ రమణ, బాలు, సూరిశెట్టి రాము, నవీన్‌, మళ్ల రాజేష్‌, దాడి ముసిలినాయుడు, మళ్ల వరహా నరసింగరావు, ఆడారి అబ్బాయినాయుడు, శివ, శ్రీరామ్మూర్తి, యోగి నాగేశ్వరరావు, నరసింగరావులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామ స్థులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T06:24:59+05:30 IST