Abn logo
Sep 23 2021 @ 00:54AM

ఈ యాసంగిలో వరిసాగుకు కళ్లెం!!

జిల్లాలో వరి సాగును తగ్గించేందుకు యంత్రాంగం చర్యలు

కనీసం 20 నుంచి 30 శాతం తగ్గింపునకు సర్కారు ఆదేశాలు జారీ!

ఈనెల 24వ తేదీ నుంచి 30 వరకు అవగాహన సదస్సులు

ఏర్పాట్లు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు

ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం

ఈ వానాకాలంలో 3లక్షల 75 వేల ఎకరాలలో సాగైన వరి

వరికి బదులు ఇతర పంటల సాగు కష్టమేనంటున్న రైతులు

ఆరుతడి పంటలకు దిగుబడి రాదంటూ అన్నదాత నిట్టూర్పు 

జిల్లావ్యాప్తంగా 70 శాతానికి పైగా వరి సాగు విస్తీర్ణం 

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వరి సాగు విస్తీర్ణాన్ని వచ్చే ఈ యాసంగి సీజన్‌లో  తగ్గించేందుకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు  రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లను సైతం చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా వారం రోజుల పాటు సదస్సు లను నిర్వహించనున్నారు. జిల్లాలో బోర్ల కింద వరి సాగును తగ్గించి ఆరుతడి పం టలను సాగు చేయాలని కోరనున్నారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవ గాహన కల్పించడంతో పాటు.. ఇతర పంటలు సాగు చేస్తే వచ్చే లాభాలను  వివ రించనున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న రైతులు మాత్రం ప్రత్యా మ్నాయ పంటలపై ఆసక్తి కనబరచడం లేదు. జిల్లాలో భారీ వర్షాలు పడటం, భూగర్భ జలాలు అధికంగా ఉండడం వల్ల రైతులు యాసంగిలో కూడా వరి సాగుకే మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పెరిగిన వరి సాగు  విస్తీర్ణం

రాష్ట్ర ప్రభుత్వం వరి సాగును తగ్గించేందుకు సిద్ధం అవుతోంది. ప్రతీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు ఏర్పడటం, కేంద్రం మొత్తం కొనుగోలుకు సహ కరించక పోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన కొన్నేళ్లుగా వరికే ప్రోత్సాహం ఇవ్వడం వల్ల అన్ని జిల్లాలలో ఎక్కువ మంది రైతులు వరి సాగు ను పెంచారు. దొడ్డురకంతో పాటు సన్నరకాలను సాగు చేస్తున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, బోర్లతో పాటు బావుల కింద సాగు చేస్తున్నారు. మద్దతుధర వస్తుం డటంతో ఇతర పంటలు వేసే రైతులు కూడా వరి సాగుకు మళ్లారు. జిల్లాలోను గడిచిన కొన్నేళ్లుగా వరి సాగు భారీగా పెరిగింది. వానకాలంతో పాటు యాసంగిలో వరి సాగు విస్తీర్ణం పెంచారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్నంలో 70 శాతానికి పైగా వరినే పండిస్తున్నారు. జిల్లాలో ఈ వానకాలంలో 3 లక్షల 75 వేల ఎకరాలలో వరి సాగు అయ్యింది. ఈ సాగు యాసంగిలో మరింత పెరుగనుంది. గత సంవత్స రం యాసంగిలో మూడు లక్షల 85 వేల ఎకరాలలో వరి సాగు అయ్యింది. జిల్లాలో నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌ల నుంచి సాగునీరు అందడం వల్ల వరి సాగు బాగా పెరిగింది. 

జిల్లాలో లక్షా 75వేల బోరువెల్స్‌

జిల్లాలో లక్షా 75వేల బోరువెల్స్‌ ఉన్నాయి. వీటి కింద కూడా వరి సాగు అవుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఈ వరి సాగు పెరుగుతూ వస్తోంది. గతంలో ధాన్యం మార్కెట్‌లో వ్యాపారులకు అమ్మగా.. కొన్నేళ్లుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. వరి దిగుబడి పెరుగడం, మద్దతుధర రావడం, ఖర్చు తక్కువగా ఉండ డంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు వైపు మొగ్గారు. వానాకాలం సీజన్‌ అక్టోబ ర్‌ నెలలో పూర్తవుతుండటంతో యాసంగి కోసం రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే, యాసంగికి నెలన్నర రోజుల సమయం ఉండడంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు

జిల్లాలో ఈనెల 24వ తేదీ శుక్రవారం నుంచి క్లస్టర్ల వారీగా సదస్సులను రైతు వేదికలలో నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈనెల 30 వరకు ఈ సదస్సు లు నిర్వహిస్తారు. వ్యవసాయ, ఉద్యావన, పశు సంవర్ధక శాఖ, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. జిల్లా లో బోర్ల కింద వరికి బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు, మొక్కజొన్న, ఎర్రజొన్న, సజ్జ, జొన్న పంటలపై అవగాహన కల్పించనున్నారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేస్తే  కలిగే లాభాలను రైతులకు వివరించ నున్నారు. అంతేకాకుండా వాటికి వస్తున్న ధరలు, అలాగే మార్కెంటింగ్‌ వంటి అంశాలను రైతులకు వివరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో సాగు కానున్న వరి విస్తీర్ణంలో కనీసం 20 నుంచి 30 శాతం వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వరి సాగు చేస్తే వచ్చే ఇబ్బందులతో పాటు ఇతర పంటలు వేస్తే లాభాలను వివ రించనున్నారు. రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కొంతమేర వరి సాగు తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇతర పంటల సాగుపై ససేమీరా

జిల్లాలో వరి సాగు చేసే రైతులు మాత్రం ఇతర పంటలు సాగు ఇబ్బందేనని అంటున్నారు. ఇన్నేళ్లు వరి పండించి ఆరుతడి పంటలు వేస్తే దిగుబడి రాదని అం టున్నారు. వరి సాగు చేసే భూములలో నీటి నిల్వలు ఉండడం వల్ల ఆరుతడి పం టలకు అనుకూలం కాదంటున్నారు. కొంతమంది రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలకు ధరలు పెంచాలని అంటున్నారు. కొన్ని పంటలు దిగుబడి రావని, ధరలు పెంచితే ఉపయోగం ఉంటుందని వారంటున్నారు.

ఈ భూములు వరి పంటకే అనుకూలం

: సాయిలు (రైతు , కోటగిరి)

నేను మూడు దశాబ్దాలుగా వరి పంటను సాగు చేస్తున్నా. మా భూములు వరి పంటకే అనుకూలం. వేరే పంట యాసంగిలో వేసిన పండదు. గతంలో అధికారుల సూచన మేరకు పొద్దుతిరుగుడు సాగుచేశాం. దిగుబడి రాక అప్పుల పాలయ్యాం. మా భూములలో దొడ్డు రకాల సాగుకు ప్రభుత్వం సహకరించాలి.

మొక్కజొన్న, పొద్దుతిరుగుడుకు ధరలు పెంచాలి

: రాజు (రైతు, ఎత్తొండ)

ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట లకు ధరలు పెంచాలి. దిగుబడి బాగా వచ్చే విత్తనాలు సరఫరా చేయాలి. వరి పండించే భూములు ఇతర పంటలకు అనుకూలంగా ఉండవు. రైతులు వేసినా.. గిట్టుబాటు ధర పెంచడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. యాసంగిలో దొడ్డు రకం వరి సాగుకు అవకాశం ఇవ్వాలి. రైతులు ఒకేసారి పంట మార్చాలంటే సమస్యలు వస్తాయి.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన

: మేకల గోవింద్‌ (జిల్లా వ్యవసాయ అధికారి)

జిల్లాలో ఈ యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి. బోర్ల కింద పంటలు వేసే రైతులు వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, మొక్కజొన్న, ఎర్రజొన్న, సజ్జ, జొన్న పంటలను సాగు చేయాలి. జిల్లాలో శుక్రవారం నుంచి క్లస్టర్ల వారీగా రైతు వేదికలలో రైతులకు అవగాహన కల్పిస్తాం. ఈనెల 30 వరకు సదస్సులను నిర్వహిస్తాం. 

వరి సాగు విస్తీర్ణం తగ్గించాలి : జేడీఏ

డిచ్‌పల్లి: జిల్లాలో రైతులు రానున్న యాసంగి సీజన్‌లో మంచి దిగుబడులు, అధిక లాభాలు పొందేందుకు వరికి ప్రత్యామ్నాయంగా పొద్దుతిరుగుడు, శనగలు, నువ్వులు, కందు లు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ సూచించారు. ఈనెల 24 నుంచి 30 వరకు వరికి ప్రత్యామాయంగా యాసంగిలో ఇతర పంటలు ప్రోత్సహించేందుకు రైతు వేదికల ద్వారా అవగహన కార్యక్రమ్రా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం మండలంలోని నడిపల్లిలో గల రైతు వేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యన వన పంటల అధికారుల సమావేశం నిర్వహించారు.