Abn logo
Jul 22 2021 @ 02:43AM

పోలీసు కంట్రోల్‌ రూములో.. హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కడప(క్రైం), జూలై 21: కడప జిల్లాకోర్టు సముదాయంలోని పోలీసు కంట్రోల్‌ రూములో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.... కడప మారుతీనగర్‌కు చెందిన ఓ.విజయకుమార్‌ (54) 1993 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం జిల్లా కోర్టు సముదాయంలోని సీసీఆర్‌ సెంటరులో విధులు నిర్వహిస్తున్నారు. పది సంవత్సరాల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో రెండుసార్లు గుండెకు సంబంధించిన వ్యాధులు రావడంతో బైపాస్‌ సర్జరీ చేయించుకున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడం, మరికొన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఆరోగ్యం కుదుటపడడంలేదని కొన్ని రోజులుగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు.  మంగళవారం రాత్రి విధులకు వచ్చిన ఆయన అర్ధరాత్రి  పోలీసు కంట్రోల్‌ రూములోని ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  ఓఎస్డీ దేవప్రసాద్‌, కడప డీఎస్పీ సునీ ల్‌, సీఐ ఘటన స్థలాన్ని పరిశీలించారు.