గత జన్మలో నేనే శ్రీవైకుంఠం రాజు!

ABN , First Publish Date - 2021-01-03T07:41:41+05:30 IST

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఒక ఆటో డ్రైవర్‌ తనకు పూర్వజన్మ స్మృతులు జ్ఞాపకానికి వచ్చాయని, గత జన్మలో శ్రీవైకుంఠం ప్రాంతాన్ని పరిపాలించిన

గత జన్మలో నేనే శ్రీవైకుంఠం రాజు!

 గుడి కోసం తవ్వకాలు చేపట్టిన ఆటోడ్రైవర్‌


చెన్నై, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఒక ఆటో డ్రైవర్‌ తనకు పూర్వజన్మ స్మృతులు జ్ఞాపకానికి వచ్చాయని, గత జన్మలో శ్రీవైకుంఠం ప్రాంతాన్ని పరిపాలించిన రాజును తానేనని ప్రకటించి సంచలనం రేపాడు.

రెడ్డియార్‌పట్టికి చెందిన ఆటో డ్రైవర్‌ సుందరీ కన్నన్‌ (47) కొద్ది రోజులుగా తన పూర్వజన్మ వృత్తాంతాలన్నీ జ్ఞాపకం వచ్చాయని, గత జన్మలో తాను శ్రీవైకుంఠం ప్రాంతాన్ని పరిపాలించిన రాజునని ప్రచా రం చేసుకుంటున్నాడు. తాను రాజుగా ఉన్నప్పుడే తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాణం జరిగిందని, అదే సమయంలో తన ఏలుబడిలో ఉన్న ప్రాంతంలో కొంగరాయకురిచ్చి వద్ద ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించానని, ఆ గుడి భూమిలో కూరుకుపోయిందని తెలిపాడు.


ఈ నేపథ్యంలో శనివారం నలుగురు కార్మికులను నియమించి ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించాడు. తహసీల్దార్‌ గోపాలకృష్ణన్‌ తవ్వకాలను అడ్డుకున్నారు. పురావస్తు పరిశోధన శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు జరపటం నేరమంటూ సుందరీ కన్నన్‌ను తీవ్రంగా మందలించారు. సుందరీ కన్నన్‌ మాట్లాడుతూ.. గత జన్మలో రాజుగా ఉన్నప్పుడు రాణితో కలిసి బృహదీశ్వరాలయ తొలి కుంభాభిషేకానికి వెళుతుండగా తనను ప్రేమించిన పనిమనిషి విషాహారం పెట్టి హత్య చేసిందని చెప్పాడు. 




Updated Date - 2021-01-03T07:41:41+05:30 IST