నెట్టికంటి ఆలయంలో కొవిడ్‌ బాధితుల పేరిట

ABN , First Publish Date - 2021-05-15T06:03:33+05:30 IST

కరోనా బాధితుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉచితంగా అష్టోత్తర నామార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ సుగుణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నెట్టికంటి ఆలయంలో కొవిడ్‌ బాధితుల పేరిట
ఆంజనేయస్వామి దేవస్థానం


ఉచిత అష్టోత్తర నామార్చనలు

గుంతకల్లు, మే 14: కరోనా బాధితుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉచితంగా అష్టోత్తర నామార్చన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ సుగుణమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు తెలియజేశారు. కరోనా బాధితులు తమ పేర్లను 72972 70565, 7207230565 నెంబర్లకు ఫోన్‌చేసి చెబితే స్వామివారి అష్టోత్తర నామార్చనను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక పూజలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రుసుమును చెల్లిస్తే పరోక్ష సేవలను అందజేస్తామన్నారు. పంచామృత అభిషేకం రూ. 500, ఆకుపూజ రూ. 500, సింధూర సహస్ర నా మార్చన రూ. 1,116, ఆదివారాలలో ఆయుష్య హో మం రూ.5,116, ప్రతి మంగళవారం మన్యుశూక్త హోమం రూ. 2,500, గురువారాలలో ధన్వంతరీ హోమం రూ. 5,116 రుసుమును ఎస్‌బీఐ ఖాతా నెం. 52121617736 (ఐఎ్‌ఫఎ్‌ససీ నెం. ఎస్‌బీఐ నెం. 21513)కు ఫోన్‌పే, గూగుల్‌పే, యూపీఐ ఐడీ: (క్యాపిటల్‌ లెటర్స్‌లో.. ఈఓకసాపురంఅట్‌దరేట్‌ఎ్‌సబీఐకు డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చన్నారు. పూజలు జరపాల్సిన తేదీ, పేరు, గోత్రం, అడ్రసును వాట్సప్‌ నెం బర్లు 9441052069, 9492026023, 99082 41055లకు మెసేజ్‌ పంపాలన్నారు. పరోక్ష పూజల నిర్వహణను దేవస్థానం యూట్యూబ్‌ లైవ్‌ ప్రోగ్రాం లేదా ఫేస్‌బుక్‌ లైవ్‌ ప్రోగ్రాంల ద్వారా కవర్‌చేసి లింక్‌ను పంపుతుందన్నారు. 


Updated Date - 2021-05-15T06:03:33+05:30 IST