ముద్ర రుణం పేరిట రూ. 1. 28 లక్షలకు టోకరా

ABN , First Publish Date - 2022-05-15T17:47:26+05:30 IST

ముద్ర రుణం పేరిట రూ. 1. 28 లక్షలకు టోకరా

ముద్ర రుణం పేరిట రూ. 1. 28 లక్షలకు టోకరా

కామారెడ్డి: ముద్ర రుణం పేరిట సైబర్ మోసం జరిగిపోయింది. ముద్ర రుణం పేరిట 1,28,000 రూపాయలకు సైబర్ నేరగాడు భారీ టోకరా పెట్టాడు. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కంపెల్లి ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ముద్ర రుణం కోసం ఆన్ లైన్ లో లింక్ ఓపెన్ చేయగా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. లోన్ మంజూరు కొరకు నగదు చెల్లించాలని సైబర్ నేరగాడు నమ్మబలికాడు. దీంతో విడతలవారీగా ఆన్ లైన్ అకౌంట్ ద్వారా 1,28,000 నగదు బదిలీ చేసినట్లు ఓబుల్ రెడ్డి తెలిపారు. తిరిగి ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఓబుల్ రెడ్డి మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-15T17:47:26+05:30 IST