రైతుల పేరిట.. నల్లమట్టి రవాణా

ABN , First Publish Date - 2022-04-28T06:35:08+05:30 IST

ప్రటఠీ ఏడాది మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రైతుల పంట పొలాలకు చెరువుమట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ప్రతీ సంవత్సరం యాసంగిలో పంటపొలాలు కోతలు పూర్తి అయిన తర్వాత రైతులు భూసారాన్ని కాపాడుకోవడానికి చెరువు మట్టిని ఎరువుగా పంట పొలాల్లో, తోటల్లో వేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా గ్యాంగ్‌ ఆయా చెరువుల నుంచి మట్టిని ఇతర మండలాలకు నింబంధనలకు విరుద్ధంగా యఽథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

రైతుల పేరిట.. నల్లమట్టి రవాణా
ముచ్కూర్‌ గ్రామంలోని నాల్ల చెరువులో నుంచి మట్టిని టిప్పర్‌లో తరలిస్తున్న దృశ్యం

కట్ట మరమ్మతు పేరిట అక్రమ మట్టిదందా 

ముచ్కూర్‌ గ్రామంలోని నాళ్ల, బసిరెడ్డి చెరువుల్లో నుంచి యఽథేచ్ఛగా నల్లమట్టి రవాణా

జనావాసాల మధ్యలోంచి 

అధికలోడుతో వెళ్తున్న మట్టి టిప్పర్‌లు 

గుంతలమయం అవుతున్న ఆర్‌ అండ్‌ బి రోడ్లు 

బాల్కొండతో పాటు ఇతర మండలాలకు తరలుతున్న మట్టి 

ఒక్కో టిప్పర్‌కు

రూ.8 వేల నుంచి రూ.9 వే లు 

రెండు నెలల్లో రూ.లక్షలు దండుకున్న అక్రమార్కులు 

 రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల చర్యలు శూన్యం 

భీమ్‌గల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 27: ప్రటఠీ ఏడాది మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రైతుల పంట పొలాలకు చెరువుమట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ప్రతీ సంవత్సరం యాసంగిలో పంటపొలాలు కోతలు పూర్తి అయిన తర్వాత రైతులు భూసారాన్ని కాపాడుకోవడానికి చెరువు మట్టిని ఎరువుగా పంట పొలాల్లో, తోటల్లో వేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా గ్యాంగ్‌ ఆయా చెరువుల నుంచి మట్టిని ఇతర మండలాలకు నింబంధనలకు విరుద్ధంగా యఽథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని ఇష్టం వచ్చిన చోట్లకు తరలిస్తున్నారు.గ్రామంలోని రైతుల పంట పొలాలకు తరలించాల్సిన నల్లమట్టిని ఇతర మండలాలకు తరలిస్తున్నారు. గ్రామంలో వేలం పాటల ద్వారా నల్లమట్టిని తరలిండానికి వేలం పాటలు పాడుతున్నారు.అంటే నల్లమట్టిని తరలించే మాఫియా గ్యాంగ్‌ వేలంపాటను ద క్కించుకొని నల్లమట్టి రవాణాకు యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు సైతం ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఫ కట్ట మర మ్మతుల పేరిట మట్టి రవాణా 

గత ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురిసి చెరువులు నిండుకుండలా మారాయి. ఇదే క్రమంలో భీమ్‌గల్‌ మండలంలోని ముచ్కూర్‌ గ్రామంలోని నాళ్ల చెరువుకట్ట తెగిపోయింది.తాత్కాలికంగా కట్టను అధికారులు మరమ్మతులు చేశారు. కట్టను పూర్తిస్థాయిలో బలోపే తం చేయడానికి గత మూడు నెలల నుంచి కట్ట మరమ్మతు ప ను లు శరవేగంగా జరుగుతున్నాయి. కట్టకు కావాల్సిన మట్టిని నాల్ల చె రువు కింది భాగం నుంచి తీస్తూ ఇరిగేషన్‌ అధికారులు పనులు చేపడుతున్నారు. ఇదేఅదునుగా భావించిన ఊర్లోని కొందరు నల్ల మట్టిని తరలించేందుకు వ్యూహాలు పన్నారు.సంబంధిత శాఖ అధికారులను మచ్చిక చేసుకొని చెరువు నుంచి మట్టిని రాత్రిబంవళ్లు జేసీబీ సహాయంతో ట్రిప్పర్‌ల ద్వారా గ్రామంలోకి కాకుండా ఇతర మండలాలకు తరలిస్తున్నారు.అధిక లోడుతో మట్టి ట్రిప్పర్‌లు వెళ్లడం మూలంగా భీమ్‌గల్‌ నుంచి ముచ్కూర్‌ గ్రామం వరకు వేసిన ఆర్‌ండ్‌ బి రహాదారి పూర్తిగా చెడిపోతుంది. జనావాసాల మధ్య నుంచి అతి వేగం గా అధికలోడుతో మట్టి ట్రిప్పర్‌ లు వెళ్లడంతో ప్రజలు భయబ్రాంతులకు గురిఅవుతున్నారు. నాళ్ల చెరువు నుంచే కాకుండా గ్రామంలోని బసిరెడ్డి చెరువు నుంచి కూడా మట్టి అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. ఇప్పటికైనా సంభందిత శాఖ రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై మండల రెవెన్యూ అధికారి రాజేందర్‌ను  వివరణ కోరగా.. తాను సెలవుల్లో ఉన్నానని, రాగానే చర్యలు తీసుకుంటానని చెప్పడం కొసమెరుపు. ఇతర మండలాలకు టిప్పర్‌ల ద్వారా తరలించడానికి ఎలాంటి అనుమతులు లేవని, ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సంబంధం ఉంటుందని తెలిపారు.

Updated Date - 2022-04-28T06:35:08+05:30 IST