బిట్‌కాయిన్స్‌ పేరిట.. 52 కోట్లకు టోకరా

ABN , First Publish Date - 2020-10-02T08:06:40+05:30 IST

బిట్‌కాయిన్స్‌ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 మందికి రూ. 52 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (

బిట్‌కాయిన్స్‌ పేరిట.. 52 కోట్లకు టోకరా

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): బిట్‌కాయిన్స్‌ పేరుతో దేశవ్యాప్తంగా 1,200 మందికి రూ. 52 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాడిని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు.


వివరాల్లోకి వెళ్తే.. సిరిమల్ల నాగరాజు మరికొందరితో కలిసి నాలుగు వెబ్‌సైట్లను తయారు చేశాడు. బిట్‌కాయిన్స్‌పై పెట్టుబడి పెడితే.. 18 వారాల్లో అధిక మొత్తాల్లో లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. చైన్‌ స్కీమ్‌ పద్ధతిలో దేశవ్యాప్తంగా 1,200 మంది నుంచి రూ. 52 కోట్లకు పైగా వసూలు చేశాడు.


ఒక్క తెలంగాణలోనే అతడి బాధితులు  250 మంది ఉన్నారు. బొల్లారపు రామకృష్ణ, మరికొందరు బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిమల్ల నాగరాజును అరెస్టు చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారు.  

Updated Date - 2020-10-02T08:06:40+05:30 IST