Abn logo
Jan 25 2021 @ 01:10AM

కొవిడ్‌ హీరోల చేతులమీదుగా..

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్థమవుతోంది. కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలను కొవిడ్‌ హీరోల చేతుల మీదుగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్‌ చేసింది. ఈ విషయాన్ని జగపతిబాబు ఓ వీడియో ద్వారా తెలిపారు. తమ జీవితాల్ని పణంగా పెట్టి, కొవిడ్‌ సమయంలో అలుపెరగకుండా పోరాడుతూ వస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మెడికల్‌, పోలీసు, మున్సిపల్‌, మీడియా సిబ్బందితో ‘ఎఫ్‌సీయూకే’ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేయిస్తున్నట్లు జగపతిబాబు చెప్పారు. ఇది పూర్తి రొమాంటిక్‌ కామెడీ సినిమా అనీ, ఇందులో తను పోషించిన తండ్రి పాత్ర తృప్తినిచ్చిందనీ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement