హరితహారంలో....శభాష్‌

ABN , First Publish Date - 2021-07-25T05:34:29+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రా ష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.

హరితహారంలో....శభాష్‌
జగిత్యాల శివారులో మొక్కలు నాటుతున్న దృశ్యం

రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా

- ఏడో విడతలో లక్ష్యానికి మించి మొక్కలు

- జిల్లాలో 103.91 శాతం లక్ష్యం పూర్తి

- లక్ష్యం 42.43 లక్షలు...నాటింది 44.09 లక్షలు

జగిత్యాల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడవ విడత హరితహారం కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రా ష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. లక్ష్యానికి మించి మొక్కలు నాటి హరితహారం ప్రగతిని జగిత్యాల జిల్లాను అధికారులు, ప్రజాప్రతి నిధు లు పరుగులు పెట్టించారు. దీంతో రాష్ట్రంలో నిర్మల్‌ తదుపరి జగిత్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులచే శభాష్‌ అనిపించుకుంటోంది. రాష్ట్రంలో నిర్మల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, జగిత్యాల జిల్లాలో 42.43 లక్షల మొక్కల లక్ష్యానికి గానూ 44.09 లక్షల మొక్కలు నాటి 103.91 శాతం లక్ష్యాన్ని సాధించి రెండవ స్థానంలో నిలిచింది. 

లక్ష్యానికి మంచి సాధించిన ప్రభుత్వ శాఖలు ఇవే....

జిల్లాలో 27 వివిధ ప్రభుత్వ శాఖలకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే బాధ్యతలను అప్పగించారు. ఇందులో ఇప్పటి వరకు అటవీ శాఖ 2,46,877 మొక్కలు నాటి 987.51 శాతం లక్ష్యాన్ని అధికంగా సాధించింది. సెర్ఫ్‌ 5 లక్షల మొక్కల నాటే లక్ష్యానికి గానూ 16,78578 మొక్కలు నాటి 335.72 శాతం లక్ష్యాన్ని అధికంగా సాధించిం ది. మైన్స్‌ శాఖ వెయ్యి లక్ష్యం ఉండగా 2 వేల మొక్కలు నాటి 200శాతం అధిక లక్ష్యాన్ని సాధించాయి.

లక్ష్యం దిశగా అడుగులు పడని ప్రభుత్వ శాఖలు ఇవే...

జిల్లాలో పదకొండ వివిధ ప్రభుత్వ శాఖలు హరితహారంలో భాగంగా లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయాయి. కనీసం ఒక్క శాతం మొ క్కలు నాటని జాబితాలో పలు ప్రభుత్వ శాఖలున్నాయి. పంచాయతీ రాజ్‌ శాఖ 22,500 లక్ష్యం, చిన్న నీటిపారుదల శాఖ 50 వేలు, ఎస్సారెస్పీ 1,77,800, మార్కెటింగ్‌ శాఖ 1,300, దేవదాయ శాఖ 2 వేలు, ఇంటర్‌ కాలేజ్‌ ఎడ్యూకేషన్‌ వెయ్యి, జెఎన్‌టీయూ 500, కోరుట్ల వెటర్నరీ కాలేజ్‌ వెయ్యి, పశువైద్య శాఖ వెయ్యి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ 1,200, పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం వెయ్యి మొక్కలు నాటా లన్న లక్ష్యం ఉన్నప్పటికీ ఇప్పటివరకు మొక్కలు నాటలేదు. 

ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు....

ఈనెల 1వ తేది నుంచి జిల్లాలో నిర్వహిస్తున్న ఏడవ విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నా టేందుకు ప్రోత్సహించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఇంటికి ఆరు మొక్కల పంపి ణీని సూచించారు. ఈ మేరకు ప్రజలు అడిగిన మొక్కలను అధికారులు అందజేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాల్టీల్లో 12 నర్సీరీలు, 380 పంచా యతీల్లో ఒక్కో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. 

జిల్లాలో గత ఆరు విడతల్లో ఇలా....

జిల్లాలో ప్రారంభం నాటి నుంచిఆరో విడత హరితహా రం వరకు 8,58, 51,962 మొక్కలు నాటగా ఇందులో 81 శాతం మొక్కలు బతికి ప చ్చదనం తెచ్చాయి. ఇందులో 2015-16లో 80 శాతం లక్ష్యం సాధించా యి. 2016-17లో 85.62 శాతం, 2017-18లో 80.02 లక్ష్యం సాధిం చారు. 2018-19లో 81.55 శాతం, 2019-20లో 80.51 శాతం, 2020-21లో 81.90 శాతం లక్ష్యాన్ని సాధించారు. 2021-22లో మరో కోటి మొక్కలు నాటాల ని లక్ష్యం పెట్టుకుని ఇప్పటికే 23,88,748 మొక్కలను నాటినట్లు అధికా రుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 42.43 లక్షల మొక్కల లక్ష్యానికి గానూ 44.09 లక్షల మొక్కలు నాటి రాష్ట్రంలోనే ముందంజలో జగిత్యాల జిల్లా నిలిచింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం

- గుగులోతు రవి నాయక్‌, కలెక్టర్‌, జగిత్యాల

జగిత్యాల జిల్లాలో ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఏడో విడత హరిత హారం కార్యక్రమం నిర్వహించడానికి పకడ్భంది ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. సమిష్టికృషి ఫలితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నాము. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల సభ్యులు, యువజనులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నాము.


సీఎం కేసీఆర్‌ ఆలోచన మేరకే...

-డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు హరితహారం కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నాము. అన్ని వర్గాల భాగస్వామ్యంతో కార్య క్రమాన్ని విజయవంతం చేయగలుగుతున్నాము. ఎప్పటికప్పుడు అధికారులు, ప్ర జాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్ల లక్ష్యానికి మించి ప్ర గతిని సాధిస్తున్నాము. 

సమిష్టి కృషి ఫలితంగానే....

- కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ఎమ్మెల్యే, కోరుట్ల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమాలను విడతల వారిగా నిర్వహిస్తున్నాము. సమష్టి కృషి ఫలితంగా అనుకున్న దానికంటే ఎక్కువగా లక్ష్యాన్ని సాధిస్తున్నాము. మొక్కలు నాటడమే కా కుండా సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. పచ్చదనం పెంపొందించడం వల్ల వచ్చే బహుళ ప్రయోజనాలను ప్రజలకు వివరిం చి భాగస్వామ్యం చేస్తున్నాము.



Updated Date - 2021-07-25T05:34:29+05:30 IST