May 17 2021 @ 01:25AM

జూన్‌ తొలి వారంలో... మళ్లీ సెట్స్‌కు!

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌, గోవాలో తొలి షెడ్యూల్‌ చేశారు. జూన్‌ తొలి వారంలో సెకండ్‌ షెడ్యూల్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ వెల్లడించారు. దీంతో సినిమా ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టినట్టు అయ్యింది. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న చిత్రమిది. ఇందులో  నాగార్జున సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. దీని తర్వాత ‘బంగార్రాజు’ చేస్తారట.