Abn logo
Mar 2 2021 @ 01:05AM

జూన్‌ తొలివారంలో...

కీర్తీ సురేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. నగేష్‌ కుకునూర్‌ దర్శకుడు. జూన్‌ 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రనిర్మాత సుధీర్‌ చంద్ర పాదిరి వెల్లడించారు. సహ నిర్మాత శావ్యా వర్మ ‘‘మహిళా పాధాన్య చిత్రమిది. కీర్తీ సురేశ్‌ షూటర్‌గా కనిపించనున్నారు. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాం’’ అని చెప్పారు. ఆది పినిశెట్టి హీరోగా, జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ‘దిల్‌’ రాజు సమర్పకులు.

Advertisement
Advertisement
Advertisement