Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవాలయాల్లో దొంగలు పడ్డారు

పి.గన్నవరం, డిసెంబరు 3: పి.గన్నవరం పాత, కొత్త అక్విడెక్టు వద్ద గల  ఆంజనేయస్వామి, శ్రీపటాభిరామస్వామి ఆలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శ్రీపట్టాభిరామస్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి హుండీని తెరిచినా నగదు లేకపోవడంతో స్వామివార్ల నుదిటిన ఉన్న గిల్టు బొట్టులను తీసుకుని ఉడాయించారు. శ్రీపంచముఖ ఆంజనేయస్వామి ఆల యంలోకి దొంగలు ప్రవేశించి హుండీని తీసుకునివెళ్లినట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ సూపర్‌ తెలిపారు. రెండు రోజులు క్రితమే హుండీలోని నగదును తీసి నట్టు చెప్పారు. ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ సురేంద్ర తెలిపారు.

 


Advertisement
Advertisement