ఆమె చనిపోయి 11నెలలు అయింది.. ఊహించని విధంగా ఇటీవల కొడుకు గదిలో మృతదేహం ప్రత్యక్షం.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-26T22:07:03+05:30 IST

ఆ మహిళ చనిపోయి ఇప్పటికి 11నెలలు అయింది. అంతా ఆమెను పూర్తిగా మరచిపోయారు. కానీ ఒక్కసారిగా ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రాంతవాసులంతా మరచిపోయిన ఆమెను.. మళ్లీ గుర్తు చేసుకున్నారు...

ఆమె చనిపోయి 11నెలలు అయింది.. ఊహించని విధంగా ఇటీవల కొడుకు గదిలో మృతదేహం ప్రత్యక్షం.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

ఆ మహిళ చనిపోయి ఇప్పటికి 11నెలలు అయింది. అంతా ఆమెను పూర్తిగా మరచిపోయారు. కానీ ఒక్కసారిగా ఆమె మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రాంతవాసులంతా మరచిపోయిన ఆమెను.. మళ్లీ గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఎవరి పనుల్లో వారు ఉండగా.. ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అంతా షాక్ అయ్యారు. లోపలికి వెళ్లి చూడగా.. మహిళ మృతదేహం కనిపించింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


పెరంబలూరు జిల్ల పరవాయి గ్రామానికి చెందిన ముక్కాయి అనే మహిళకు బాలమురగన్(38) అనే కుమారుడు ఉన్నాడు. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. దీంతో కూలీనాలీ చేసి కొడుకును పెంచి పెద్ద చేసింది. బాలమురుగన్‌కు మతిస్థిమితం ఉండదు. దీంతో పనులు ఏవీ చేయలేడు. ఇంత వయస్సు వచ్చినా కొడుకును చిన్నపిల్లాడిలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా.. ఉన్నట్టుండి విధి వీరిపై చిన్నచూపు చూసింది. 11నెలల క్రితం బాలమురుగన్ తల్లి అనారోగ్యానికి గురైంది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన ఆమె తర్వాత చనిపోయింది. దీంతో బాలమురుగన్ అనాథ అయ్యాడు.

తాగుడుకు బానిసైన తండ్రి.. పీకల దాకా తాగొచ్చి.. కూతురని కూడా చూడకుండా..


అసలే మతిస్థిమితం లేని బాలమురుగన్.. తల్లి మళ్లీ బతికొస్తుందని రోజూ ఆమెను పూడ్చిపెట్టిన ప్రదేశంలోనే ఉండేవాడు. రాత్రిళ్లు కూడా అక్కడే పడుకునేవాడు. వర్షం వస్తే.. తన తల్లి ఎక్కడ తడుస్తుందో అని తడవకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇలా తల్లి సమాధి వద్దే కాలం గడిపేవాడు. ఏమనుకున్నాడో ఏమో ఓ రోజు తల్లి శవాన్ని బయటికి తీసి, ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రోజూ కొంచెం కొంచెం మట్టి తీసి, చివరకు మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. కుళ్లిన వాసన వస్తుండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఓ రోజు బాలమురుగన్ బంధువులు, స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా శవం కనిపించింది.

35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలవడమే.. ఆ బాలిక తప్పయింది.. చేతులు కట్టేసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..


స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పెరంబలూరు ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ‘‘నాతల్లిని దూరం చేయొద్దు.. నేను మా అమ్మ వద్దే ఉంటా’’.. అంటూ బాలమురుగన్ రోధించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది. తర్వాత పోలీసులు బాలమురుగన్ పరిస్థితి తెలుసుకుని అతన్ని వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అతడి తల్లి మృతదేహాన్ని పూడ్చిపెడితే.. మళ్లీ వెలికితేసే అవకాశం ఉండడంతో గ్రామస్తుల సమక్షంలో దహనం చేశారు. బాలమురుగన్ తెలిసి చేసినా, తెలియక చేసినా, తల్లి పట్ల అతడికి ఉన్న ప్రేమ.. గ్రామస్తుల హృదయాలను కదిలించింది.

భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..

Updated Date - 2021-12-26T22:07:03+05:30 IST