సంక్షిప్తంగా

ABN , First Publish Date - 2020-05-26T10:43:25+05:30 IST

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఐకియా హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. ‘క్లిక్‌ అండ్‌ కలెక్ట్‌’ సేవల

సంక్షిప్తంగా

  • ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఐకియా హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. ‘క్లిక్‌ అండ్‌ కలెక్ట్‌’ సేవల ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత స్టోర్‌కు వచ్చి వస్తువులను తీసుకువెళ్లవచ్చని ఐకియా తెలిపింది. 
  • స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు రియల్‌మీ.. భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 32 అంగుళాలు, 43 అంగుళాల డిస్‌ప్లేతో రెండు టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది.  వీటి ధరలు వరుసగా రూ.12,999, రూ.21,999గా ఉన్నాయి. రానున్న రోజుల్లో 55 అంగుళాల టీవీని తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌టీవీలను దిగుమతి చేసుకోనున్నట్లు పేర్కొంది.  
  • భారతి ఎయిర్‌టెల్‌ 100 కోట్ల డాలర్లను (సుమారు రూ. 7,500 కోట్లు) సమీకరించనుంది. సంస్థ ప్రమోటర్‌ అయిన భారతి టెలికామ్‌కు చెందిన 2.7 శాతం వాటాల (15 కోట్ల ఈక్విటీ షేర్లు)ను విక్రయించటం ద్వారా ఈ మొత్తాలను సేకరించనుంది.  
  • ఎంఎ‌స్‌ఎంఈలకు డిజిటల్‌ లెడ్జర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలందిస్తున్న ‘ఖాతాబుక్‌’ సిరీస్‌ బీ రౌండ్‌లో భాగంగా రూ.454 కోట్లు సమీకరించింది. ఈ నిధులతో మరిన్ని ఎంఎ స్‌ఎంఈలకు రుణాలిచ్చే అవకాశం లభించనుంది. దక్షిణ భారతదేశంలో ఖాతాబుక్‌కు దాదాపు 75 లక్షల రిజిస్టర్డ్‌ వ్యాపారస్తులున్నారు. 
  • దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ శానిటైజర్‌ విభాగంలోకి ప్రవేశించింది. కోరోరిడ్‌ బ్రాండ్‌తో 500 ఎంఎల్‌, 1 లీటర్‌, 10 లీటర్‌, 20 లీటర్‌, 25 లీటర్‌, 200 లీటర్‌ పరిమాణంలో ఈ ఉత్పత్తులను విక్రయించనుంది. 

Updated Date - 2020-05-26T10:43:25+05:30 IST